తడిచిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలి

నవతెలంగాణ – మోపాల్ 

మోపాల్ మండల కేంద్రంలో గల వివిధ గ్రామాలలో శనివారం రోజున కురిసిన వర్షానికి ధాన్యం తడిసిపోయింది. ఆరుకాలం కష్టపడి పండించిన రైతు చివరగా విక్రయించే సమయంలో వర్షం వల్ల ధాన్యం నానిపోయిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే తడిచిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు. కొనుగోలు సమయంలో రంగు మారిందని ఎక్కువ మొత్తంలో కడ్త ను ప్రభుత్వం కట్టడి చేయాలని వారు కోరుతున్నారు. ఇప్పటికే పెట్టుబడికి చాలా పెద్ద మొత్తంలో ఖర్చు చేశారు. పంట అమ్ముకునే సమయానికి మాత్రం రైతులు ప్రకృతి వైపరీత్యాల వల్ల ప్రతిక్షణం ఇబ్బంది పడుతున్నారు. ప్రభుత్వాలు మారుతున్నాయి తప్ప రైతుల పరిస్థితులు మాత్రం మారండం లేదని, కొత్త ప్రభుత్వంలోనైనా  రైతులకు బోనస్ తో పాటూ తడిచిన ధాన్యాన్ని కొనుగోలు చేస్తే రైతు కళ్ళల్లో ఆనందం చూడొచ్చు.
Spread the love