18 ఏండ్లు నిండిన ప్రత్యేక చిన్నారుల సంరక్షణకు చర్యలేంటీ..?

18 ఏండ్లు నిండిన ప్రత్యేక చిన్నారుల సంరక్షణకు చర్యలేంటీ..?–  కేంద్రాన్ని ప్రశ్నించిన సుప్రీంకోర్టు
న్యూఢిల్లీ : ప్రత్యేక అవసరాలు, అనారోగ్యంతో ఉన్న చిన్నారులకు 18 ఏండ్లు నిండిన తరువాత సంరక్షణకు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారని కేంద్ర ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. 2015 జువెనైల్‌ జస్టిస్‌ (కేర్‌ అండ్‌ ప్రొటెక్షన్‌) చట్టంలోని సెక్షన్‌ 2 (14), (4) ప్రకారం పిల్లల సంరక్షణకు కేంద్రం ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని ఆరోపిస్తూ కెఎస్‌ఆర్‌ మీనన్‌ దాఖలు చేసిన పిటీషన్‌ను మంగళవారం సుప్రీంకోర్టు విచారించింది. ఈ పిటీషన్‌పై స్పందించాలని కేంద్రాన్ని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ డివై చంద్రచూడ్‌ నేతృత్వంలోని ధర్మాసనం ఆదేశించింది. తదుపరి విచారణను నాలుగు వారాలకు వాయిదా వేసింది. పై చట్టంలోని సెక్షన్ల ప్రకారం మానసిక అనారోగ్యంతో బాధపడుతున్న, లేదా మానసిక, శారీరక వికలాంగులు లేదా ప్రాణాంతకమైన వ్యాధి లేదా నయం చేయలేని వ్యాధితో బాధపడుతున్న చిన్నారులకు, అలాగే తల్లిదండ్రులు లేదా సంరక్షకులు లేని చిన్నారులకు ప్రభుత్వం ప్రత్యేక సంరక్షణ కార్యక్రమాలు నిర్వహించాలి. ఇలాంటి కార్యక్రమాలు లేకపోవడంతో ప్రత్యేక చిన్నారుల పరిస్థితి ఆందోళనకరంగా ఉందని పిటీషనర్‌ పేర్కొన్నారు. యంత్రాల పనితీరుపై ఇండియా ఫోరం నాయకులు పలు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. వివి ప్యాట్‌ స్లిప్‌లను ఓటర్లకు అందజేయాలని డిమాండ్‌ చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే సీఈసీకి జైరాం రమేష్‌ లేఖ రాశారు.

Spread the love