ఏది నిజం.. ఏది కుట్ర..? 

– పోచారం పార్టీ మారడం పై మత్లాబ్ ఏమిటి ? 
– వెన్నంటూ ఉండి వెన్నుపోటు పొడిచారా..? 
నవతెలంగాణ నసురుల్లాబాద్ 
రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల అనంతరం రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడడం, బాన్సువాడ నియోజకవర్గం అభ్యర్థి పోచారం శ్రీనివాస్ రెడ్డి గెలుపొందారు. పోచారం శ్రీనివాస్ రెడ్డి ఎమ్మెల్యేగా గెలుపొందడం, పార్టీలో ముఖ్య నేతగా ఉండడం బీఆర్ఎస్ పార్టీలో ఉన్న కొందరికి జీర్ణం కాకపోవడంతో పోచారంపై బీఆర్ఎస్ పార్టీలో కొందరు ముఖ్య నాయకులు కుట్ర పన్నినట్టు సమాచారం. అందులో భాగంగానే పోచారం శ్రీనివాస్ రెడ్డి తనయుడు పోచారం భాస్కర్ రెడ్డి జిల్లా సహకార సంఘం అధ్యక్షుడిగా ఉండగా ఆయనపై బీఆర్ఎస్ నాయకులు, కాంగ్రెస్ నాయకులు కలసి అవిశ్వాసానికి నోటీసులు ఇచ్చి రాజీనామా చేసేలా చేశారు. రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు జరిగి ఆరు మాసాల్లో బాన్సువాడ నియోజకవర్గం లో జరుగుతున్న రాజకీయ సమీకరణాలను దృష్టిలో ఉంచుకొని మాజీ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరికతో, బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి పై కొంత మంది సోషల్ మీడియాలో దుష్ప్రచారాన్ని మొదలు పెట్టారు. పాత వీడియోలను తీసుకు వచ్చి ఇట్టెట్టా చేస్తావ్ అంటూ సోషల్ మీడియాలో ప్రశ్నిస్తున్నారు. బాన్సువాడ నియోజకవర్గ అభివృద్ధి కోసమే కాంగ్రెస్ లో చేరానని పోచారం శ్రీనివాస్ రెడ్డి స్పష్టం చేశారు. కానీ వారి అంతర్గత అనుచరుల సమాచారం మేరకు పోచారం శ్రీనివాస్ రెడ్డి, ఎదుగుదలను చూడలేక టిఆర్ఎస్ లో కుట్ర జరిగినట్లు సమాచారం ఇచ్చారు.
జరిగింది ఏమిటి..?
ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో తిరుగులేని నాయకుడు మాజీ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి. గత 30 ఏళ్లుగా బాన్సువాడ నియోజకవర్గం లో ఎమ్మెల్యేగా గెలుస్తూ జిల్లాలో రాష్ట్రంలో అభివృద్ధిలో ఆదర్శంగా నిలిచారు. అలాంటి నేతకు కాంగ్రెస్ పార్టీలో చేరవలసిన అవసరం ఏమిటంటే కొందరు ప్రశ్నిస్తున్నారు. ప్రజా నాయకుడు. ఉన్నట్టుండి అలాంటి నేతకు పార్టీ మారాల్సిన గత్యంతరం ఎందుకు వచ్చింది. తన నాలుగు దశాబ్దాల రాజకీయ జీవితంలో అనుభవించలేని పదవులంటూ ఏమీ లేవు. కష్టపడి పైకి వచ్చిన అతనికి ఎన్నో పదవులు వరించాయి. రాష్ట్ర అసెంబ్లీలో అన్నిటికంటే పెద్ద ప్రోటోకాల్ పదవి స్పీకర్ పదవి చేపట్టారు. తెలంగాణ స్వాప్నికుడిగా పేరొందిన మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కు వెన్నెంటి ఉంటూ వెన్నుపోటు పొడుస్తున్న నాయకుల తీరు పోచారం బయటకు వెళ్ళేందుకు అసలు కారణం అయిందా? ఉమ్మడి జిల్లాలో ఓ నియోజకవర్గ ముఖ్య నేత అదృష్టం కొద్ది రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. రాష్ట్రంలో ఉన్నత స్థానంలో నిలిచారు. అలాంటి ముఖ్య నేత ఇతని చేష్టాలే పోచారం శ్రీనివాస్ రెడ్డిని పార్టీ మారేందుకు కారణం అయిందని సమాచారం. ఉమ్మడి జిల్లాలో ఉన్న ఆ ముఖ్య నేత కేసిఆర్ కు కేటీఆర్ కు అతి సన్నిహితుడుగా ఉండడం చేత ఉమ్మడి జిల్లాలో ఏకాదిపత్యం, చక్రం దింపడంలో దిట్ట.
ఆత్మకు డిసిసిబి పదవి వచ్చేలా కృషి ? 
ఆ ముఖ్య నేతకు అతి స్నేహితుడైన ఓ ఆత్మ లాగా ఉన్నా వేల్పూర్ సహకార సంఘం చైర్మన్ గా ఉన్న రమేష్ రెడ్డిని జిల్లా సహకార సంఘం చైర్మన్ గా ఏకగ్రీవంగా ఎన్నికయ్యాల చేశారు. తన ఆత్మ లాగా ఉన్నా రమేష్ రెడ్డికి నిజామాబాద్ డిసిసిబి చైర్మన్ పదవిని కట్టబెట్టడానికి వెనక నుండి చక్రం తిప్పి డైరెక్టర్లతో అవిశ్వాస పెట్టించరనే ఆరోపణ ఉంది. ప్రతి సభలో సమావేశంలో తండ్రి లాంటి పోచారం శ్రీనివాసరెడ్డి అని అనే వారు. పోచారం తనయుడికి వెన్నుపోటు పొడిచి పోచారం భాస్కర్ రెడ్డిని డిసిసిబి చైర్మన్ పదవి నుండి తప్పించడానికి తెరవెనుక సహకారం అందించింది ఎవరో కాంగ్రెస్ పార్టీలో బీఆర్ఎస్ లో పార్టీలో ఉన్న ముఖ్య నేతలందరికీ తెలుసు.
రమేష్ రెడ్డిని, ఆ ముఖ్య నేతకు వేరు చేసి ఉమ్మడి జిల్లా రాజకీయాలను చూడగలమా. ఒక వేళ డీసీసీబీ పదవిని ఆశించడం రమేష్ రెడ్డి వ్యక్తిగతమే అయితే ఉమ్మడి జిల్లాలో కీలక నేతగా బీఆర్ఎస్ పార్టీ పరువును కాపాడుకునే బాధ్యత ఆ ముఖ్య నేతకు లేదా అంటూ కొందరు ప్రశ్నిస్తున్నారు. జిల్లాలో జరుగుతున్న రాజకీయ సమీకరణాలను దృష్ట్యా వేల్పూర్ సహకార సోసైటీ ఛైర్మన్ గా ఉన్న రమేష్ రెడ్డిపై అవిశ్వాస తీర్మానం ఎందుకు పెట్టలేక పోయారు అంటూ ప్రశ్నిస్తున్నారు. ఉమ్మడి జిల్లాలో ఎంత పెద్ద కుట్ర జరుగుతున్న రాష్ట్రంలోని బీఆర్ఎస్ ముఖ్య నాయకులకు ఈ కుట్ర తెలుసా? అంటే కేసీఆర్ కు ఆత్మలా ఉంటున్నట్లుగా నటిస్తూ కేసీఆర్ ను మోసం చేసే వారి బండారం బట్టబయలైనా ఎవ్వరూ పట్టించుకోరు. బీఆర్ఎస్ ముఖ్య నాయకులు కూడా ఈ తతంగాన్ని గుర్తించరు. పోనీ రమేష్ రెడ్డిని పార్టీ నుంచి సస్పెండ్ చేయొచ్చు కదా. కనీసం ఈ చర్యకు కూడా రానివ్వరు. గత రెండు రోజుల నుంచి ఉమ్మడి జిల్లా ముఖ్య నేతలందరూ పోచారంపై ఆరోపణ వర్షం కురిపిస్తున్నారు. ఉమ్మడి జిల్లాలో ఉన్న మాజీ ఎమ్మెల్యేలు కొందరు రమేష్ రెడ్డికి వీరంతా కూడబలికి మద్ధతు ఇచ్చినట్టే కదా.
ఎవరు కుట్రదారులు..?
బీఆర్ఎస్ పార్టీని నమ్ముకుని ఉన్న పోచారం కుటుంబానికి జరిగిన అన్యాయంలో ఎవరి తప్పుంది. జరిగిన తప్పును తేటతెల్లం చేసినప్పటికీ అధిష్టానం ఇంకా ఉమ్మడి జిల్లా ఆ ముఖ్య నాయకుడి భ్రమలోనే ఉమ్మడి జిల్లా నాయకులు నేతలు ఉన్నారని పలువురు ఆరోపిస్తున్నారు. ఆ ముఖ్య నేత కేసీఆర్ పై ప్రేమను శాశ్వతంగా గుండెలో పెట్టుకుని కేవలం తన రాజకీయ శత్రువులకు సమాధానం ఇచ్చేందుకు పోచారం ఈ అడుగు వేశారని పోచారం శ్రీనివాస్ రెడ్డి వర్గీయులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
Spread the love