
నవతెలంగాణ – మల్హర్ రావు:-
ఏజెన్సీ ప్రాంతంలో గిరిజన, గిరిజనేతర పేదలకు రెండో ఆదాయం తునికాకు సేకరణ ద్వారా లభిస్తుంది. వ్యవసాయ పనులు ముగియగానే తునికాకు సేకరణపై దృష్టిని సారించి వేసవి ఆదాయం సమకూర్చుకోవడం ఏజెన్సీలోని పేదల ప్రజల జీవన విధానం. ఇప్పటికే తునికాకు ప్రూనిం గ్(చిన్న చిన్న కొమ్మలు నరకడం) పనులను చేయాల్సి ఉన్నప్పటికీ మండలంలో ఆ జాడ కానరావడం లేదు. ఫ్రూనింగ్ పనులను ముందస్తుగా చేస్తే తునికాకులు ఎక్కువగా రావడంతో పాటు నాణ్యతను కలిగి ఉంటాయి.కానీ ఇంకా కొమ్మ నరికే పనులు ప్రారంభం కాలేదు. అటవీ శాఖ నుంచి ఇంత వరకు తునికాకు ప్రూనింగ్ పనులను మొద లుపెట్టలేదు. ఆ పనులను చేపట్టే ఉద్దేశ్యం కూడా ప్రస్తుతం కనబడడం లేదు.
రాని అనుమతులు…
తునికాకు ప్రూనింగ్ పనులను చేయాడానికి ఇప్పటికే అనుమతులు రావాల్సి ఉంది. కాని నేటి వరకు అనుమతులు రాలేదు. అటవీశాఖ అధికారులు ఆ దిశలో ఎలాంటి ప్రయత్నాలను చేస్తున్నట్లు లేదు. దీంతో తునికాకు సేకరణపైన కూడా ఏజెన్సీ ప్రజల్లో అనుమానాలు వస్తన్నాయి. తునికాకు సేకరణ పనులు ఉంటుంయా? లేదా? అని అనుమానిస్తున్నారు. అలాగే తునికాకు సేకరణ కోసం ఇంత వరకు టెండర్లను వేయలేదని తెలుస్తోంది. టెండర్లు ఇంత వరకు వేయకపోవడంతో తునికాకు సేకరణ జరిగే అవకాశం లేదు. ఇదే జరిగితే వేసవిలో ఏజె న్సీలోని గిరిజన, గిరిజనేతర పేదలకు ఆదాయం లేకుండా పోతుంది. దీంతో పేదలకు ఆర్థికంగా ఇబ్బందులు పడే అవకాశం ఉంది.
అనుమతులు రాలేదు.
గొడుగు లక్ష్మన్…తాడిచెర్ల సెక్షన్ అధికారి.
తునికాకు ప్రూనింగ్ పనుల కోసం ఇప్పటి వరకు ఎలాంటి అనుమతులు రాలేదు. ఉన్నతాధికారుల నుంచి పనులు చేయించమని ఆదేశాలు వస్తే వెంటనే ప్రారంభిస్తాం