ఏది సరైన ప్రత్యామ్నాయం?

ఏది సరైన ప్రత్యామ్నాయం?రాష్ట్రంలో శాసనసభకు జరిగిన ఎన్నికల ఫలితాలు ప్రకటించబడ్డాయి ఈ ఎన్నికలలో రాజకీయ పార్టీలు స్వతంత్ర అభ్యర్థులు మొత్తం 2290 మంది 119 సీట్లకు పోటీపడ్డారు. ఇందులో 221 మంది మహిళలు ఒక ట్రాన్స్‌ జెండర్‌ కూడా ఉన్నారు. తెలంగాణలో ఓటు హక్కు ఉన్నవారు మూడు కోట్ల 17 లక్షలకు పైగా ఉన్నారు. వీరిలో 71. 38 శాతం మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు. గత శాసనసభ ఎన్ని కలకు ఇప్పటి ఎన్నికలకు మధ్య సుమారు 36లక్షలకు పైగా కొత్త ఓటర్లు పెరిగారు. పోలైన ఓట్లలో 92 లక్షల 3533 39.40 శాతం ఓట్లు తెచ్చుకొని 64 అసెంబ్లీ సీట్లను కాంగ్రెస్‌ కైవసం చేసుకుంది. అధికార పార్టీ అయిన బీఆర్‌ఎస్‌ 87లక్షల 32 వేల 992 ఓట్లు 37.39 శాతం ఓట్లు తెచ్చుకొని 39 స్థానాలకు పరిమితమైంది. గతంలో ఉన్న 49 శాసనసభ స్థానాలను కేవ లం రెండు శాతం ఓట్ల తేడాతో అధికారాన్ని చేజార్చుకుంది. బీజేపీకి గతంలో 6.98 శాతం ఓట్లతో ఒక్క సీటు గెలిచింది. మధ్యంతర ఎన్నికల్లో మరొక రెండు సీట్లు తెచ్చుకుంది. ఈ ఎన్నికల్లో 13.9 శాతం 32 లక్షల 45 వేల తొమ్మిది వందల తొంబై ఆరు ఓట్లు తెచ్చుకొని మూడు సీట్ల నుండి ఎనిమిది సీట్లకు ఎగబాకింది. ఎన్నికలు జరిగిన తీరు చూస్తే మాత్రం రాష్ట్రంలో ముక్కోణపు పోటీ జరుగుతున్నట్టు బీజేపీ చేసిన హడావుడి అంతా ఇంతా కాదు. అదే కాకుండా అధికారంలోకి వస్తే బీసీని ముఖ్యమంత్రి చేస్తామని ప్రకటించారు. కొసమెరుపు ఏమిటంటే అధికారంలో ఉన్న బీఆర్‌ఎస్‌ కొత్తగా అధి కారం చేపట్టబోతున్న కాంగ్రెస్‌కు మేమే ప్రత్యామ్నా యమన్న బీజేపీ ఎక్కువ స్థానాల్లో డిపాజిట్లు కోల్పోయి చతికిలపడటం గమనార్హం.
డిపాజిట్లు గల్లంతైన పార్టీలు
ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు ప్రజా ప్రాతినిధ్య చట్టం సెక్షన్‌ 34(1)(ఏ) ప్రకారం పదివేల రూపా యలు ఎస్సీ,ఎస్టీ అభ్యర్థులు అయితే అందులో సగం డిపాజిట్‌ చెల్లించాలి. అప్పుడే పోటీచేసే అర్హత వస్తుంది. ఈ డిపాజిట్‌ నేటి ఎన్నికల్లో పెద్ద సమస్య కాకపోయినా డిపాజిట్‌ దక్కించు కోవడం అనేది పార్టీలకు, అభ్యర్థులకు పరువు సమస్యగా మారింది. నిన్న మొన్నటి వరకు పదేండ్లు అధికారంలో ఉన్న బీఆర్‌ఎస్‌ పార్టీ కూడా ఏడు స్థానాలలో డిపాజిట్‌ కోల్పోయింది. ఈ ఏడు సీట్లు కూడా అత్యధికంగా సీట్లు గెలిచిన హైదరాబాద్‌లో ఉండటం గమనార్హం. అయితే బీఆర్‌ఎస్‌కు ఎంఐఎంకు మధ్యలో అవగాహన వలన అలా జరిగి ఉంటుందని ఊహాగానాలు కూ డా లేకపోలేదు. కొత్తగా అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్‌ కూడా 13 స్థానాల్లో డిపాజిట్‌ కోల్పోవడం పెద్ద ఎదురుదెబ్బగా చెప్పు కోవచ్చు. ఇంత అనుకూల వాతావరణంలోనూ ఎందుకిలా జరిగిందో కాంగ్రెస్‌ పార్టీ పరిశీలించుకోవాలి. గత ఎన్నికలలో కూడా కాంగ్రెస్‌కు ఇలా జరగలేదు. 94 సీట్లలో పోటీ చేసి కేవలం ఆరు సీట్లలో మాత్రమే డిపాజిట్‌ పోగొట్టుకుంది. వచ్చేది డబుల్‌ ఇంజన్‌ సర్కార్‌ ఇచ్చేది అన్ని మేమే అని చెప్పిన బీజేపీ 64 సీట్లలో డిపాజిట్లు రాకపోవడం ఆ పార్టీకి మింగుడు పడని సమస్యగా మారింది. మాజీ మంత్రి బాబూ మోహన్‌ అందోల్‌లో బీజేపీ అభ్యర్థిగా పోటీ చేయగా డిపాజిట్‌ దక్కలేదు. మాజీ ఎంపీ జితేందర్‌ రెడ్డి తనయుడు మహబూబ్‌నగర్‌లో కూడా ధరావత్‌ కోల్పోయాడు. మునుగోడులో మధ్యంతరంగా జరిగిన ఎన్నికల్లో బీజేపీ రెండో స్థానంలోకి వచ్చింది ఇప్పుడు అక్కడ డిపాజిట్‌ కూడా రాలేదు. బీజేపీతో అంటకాగిన జనసేన పవన్‌ కళ్యాణ్‌ పార్టీ పోటీ చేసిన ఏడుసీట్లలో డిపాజిట్‌ గల్లంతయింది. తెలంగాణలో పవన్‌ సినిమా ఫెయిల్‌ అయింది. బీజేపీ సోషల్‌ ఇంజనీరింగ్‌ కూడా ఫలితాలను రాబట్టలేకపోయింది. ముఖ్యం గా బీసీ ముఖ్యమంత్రి ఎస్సీ వర్గీకరణ నినాదాలు ఆకట్టుకోలేకపోయాయి.
ఎస్సీ, ఎస్టీ నియోజకవర్గాలు
రాష్ట్రంలో 19 ఎస్సీ 12 ఎస్ట్టీ నియోజక వర్గా లున్నాయి 19లో 19 నియోజకవర్గాలు ఉన్న ఎస్సీ సామాజిక వర్గం కాంగ్రెస్‌ 14 సీట్లను కైవసం చేసుకుంది. బీఆర్‌ఎస్‌ మరో ఐదింటికి పరిమిత మైంది. బీజేపీకి ఒక్క సికింద్రాబాద్‌ కంటోన్మెం ట్‌లో మాత్రమే రెండవ స్థానానికి పరి మితమైం ది. కానీ ఒక్క సీటు కూడా గెలవలేక పోయింది. 12 గిరిజన రిజర్వుడు స్థానాల్లో కాంగ్రెస్‌ తొమ్మి దింటిలో విజయం సాధించగా మిగిలిన మూడింటిలో బీఆర్‌ఎస్‌ సరిపెట్టుకుంది గిరిజన స్థానాల్లో కొన్నింటిలో బీజేపీకి ఒక్క శాతం కూడా ఓట్లు పడకపోవడం గమనించాలి. బీజేపీ ఇచ్చిన బీసీ నినాదం ఊసే లేకుండాపోయింది. గత శాసనసభకంటే కొత్త సభకు బీసీ శాసనసభ్యులు తగ్గారు. ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన అంబేద్కర్‌ విగ్రహాన్ని హైదరాబాదులో బీఆర్‌ ఎస్‌ నిర్మించింది. కొన్ని జిల్లాలకు గిరిజనుల పేరు పెట్టింది. తండాలను, ఆదివాసి గూడాలను గ్రామ పంచాయతీ లుగా చేసింది. ఇంతజేసినా దళితుల నమ్మకాన్ని కూడగట్టలేక పోయింది. దళితబంధు పెట్టిన వ్యతిరేకతను మూటగట్టుకుంది. దళితులకు మూడెకరాల భూమి, గిరిజనులకు పోడు భూముల సమస్య పరిష్కారంలో బీఆర్‌ఎస్‌ బాధ్యతాయుతంగా వ్యవహరిం చలేక పోవడం వలన దళిత, గిరిజనులకు దూరమైంది వారి విశ్వా సాన్ని పోగొట్టుకుంది. మందకృష్ణ మాదిగను చేతిలో పట్టుకొని వర్గీకరణ డిమాండ్‌ను బీజేపీ ముందుకు తీసుకొ చ్చింది. మాదిగలకు బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ అన్యాయం చేసిందని కాంగ్రెస్‌ మాలల పార్టీ అని కేంద్రంలో అధికారంలో ఉన్నప్పుడు వర్గీకరణ చేయలేదు కాబట్టి బీజేపీకి మద్దతని మందకృష్ణ ప్రకటన చేశాడు. బీజేపీకి అనుకూలంగా హైదరాబాద్‌లో సభ పెట్టి మోడీని ఆహ్వానించాడు. బీజేపీ కలలన్నీ కల్లలయ్యాయి. ఆశించిన ఫలితాలు రాలేదు. అయినా బీజేపీని తక్కువ అంచనా వేయడానికి వీల్లేదు.
పెరిగిన మతోన్మాద ప్రమాదం
ఒకపక్క సోషల్‌ ఇంజనీరింగ్‌కు పాల్పడుతూ, మరోపక్క బీజేపీ గోబెల్స్‌ ప్రచారానికి పాల్పడింది. మొన్నటి ఎన్నికల్లో బీజేపీ శక్తి మూడు నుండి ఎనిమిదికి పెరిగింది. మరొక ఆందోళన కలిగించే అంశం ఏమిటంటే పద్నాలుగు లక్షల నుండి దాని ఓటింగ్‌ బలాన్ని ముప్పై రెండు లక్షలకు పెంచుకుంది. మూడవ శక్తిగా బలపడింది. అభ్యుదయ వాదులను కలవరపెట్టే అంశమిది.
ఉపాధి, సంక్షేమం సవాళ్లు
రాష్ట్రంలో గత పాలకులు అనేక సంక్షేమ పథకాలు అమలు చేసినా వ్యతిరేకత వచ్చింది. దళిత బంధు, డబుల్‌ బెడ్‌ రూమ్‌ ఇండ్లు వంటి పథకాలు అందిన వారికి సంతోషం, అందని వారి కి ఆశ్రోశం, ఆగ్రహం కలిగిస్తాయి. రైతుబంధుతో రైతుల్లో సంతో షం కానీ రుణమాఫీ కాలేదని అసంతృప్తి వ్యక్తమైంది. దీనికి తోడు ఇప్పుడు కౌలు రైతులకు కూడా ఎకరానికి రూ.12 వేలు ఇస్తామని కాంగ్రెస్‌ ప్రకటించింది. అది ఎలా అమలు చేస్తారో తేలాలి. అందరికీ పజిల్‌గా మారింది. మహిళలకి భృతికి గీటు రాయి ఏమిటో చెప్పాలి. గ్యాస్‌ సబ్సిడీ ఎంతమందికి ఇస్తారు తేలాలి. అన్నింటికీ మించి కరెంటు సబ్సిడీ అమలు చేయకపోతే కొత్తగా వచ్చే పాలకులకు షాక్‌ కొట్టే ప్రమాదం లేకపోలేదు. వీటితోపాటు పాత పథకాలను అమలు చేస్తారో రద్దు చేస్తారో తెలియాలంటే వేచి చూడాల్సిందే. అన్నిటికంటే ముఖ్యం తెలం గాణ ఉద్యమం మూడు లక్ష్యాలచుట్టూ సాగింది. అందులో నీళ్ల్లు, నిధులు, నియామకాలు. నీళ్లు, నిధులు పక్కన పెడితే ఉద్యో గాల కల్పన తెలంగాణ ఉద్యమానికి పునాది. దాన్ని విస్మరించిన పాలకులను ఇంటికి పంపారు. ఉపాధి ఎలా కల్పిస్తారు అనేది రాబోయే ప్రభుత్వానికి పెద్ద సవాలు. ఒకవేళ అది సాధ్యం కాక పోతే నిరుద్యోగభృతి ఎలా నిర్ధారిస్తారనేది ఆలోచించాల్సిన అంశ మే. పాలకవర్గాలు అధికారం కోసం ఆపద మొక్కులు మొక్కి నట్టు అనేక వాగ్దానాలు చేస్తారు. వాటిని నెరవేర్చకపోతే వ్యతిరేక తను మూటగట్టుకోవాల్సి వస్తుంది. అవకాశం కూడా లేకపో లేదు. అప్పుడు సరైన ప్రత్యామ్నాయం ఏమిటనే సమస్య తెలంగాణలో ముందుకు వస్తుంది.
ఒక పాలకపార్టీకి మరొక పాలకపార్టీ ఎన్నటికీ ప్రత్యామ్నా యం కాజాలదు. దీనికితోడు మత విభజన ఆధారంగా మెజార్టీ ప్రజల అండతో అధికారం చేజిక్కించుకోవాలని బీజేపీ గోతికాడి నక్కలా ఎదురుచూస్తోంది. బీఆర్‌ఎస్‌ బలమైన ప్రతిపక్షంగా, బా ధ్యతాయుతంగా వ్యవహరిస్తుందో లేదో అన్నది తేలాలి. అధి కారం పోయింది కాబట్టి ఆ పార్టీలో కూడా పక్కచూపులు చూసే అవకా శం లేకపోలేదు. ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరించి సామాజిక, ఆర్థిక, రాజకీయ రంగాల్లో జరగాల్సిన అభివృద్ధిపై ప్రజల్ని చైతన్యం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. దాని కోసం రాష్ట్ర పురోగ మనాన్ని కాంక్షించే శక్తులు ఒక్కటై ఐక్యంగా నిలబడి పాలకులపై కలపడాల్సిన సమయం ఆసన్న మైంది. ఇది చేస్తేనే బీజేపీని ముందుకు రాకుండా నిలువరించగలరు. ఇదే సరైన బాట. సరైన సమయం. బాట తప్పితే మతోన్మాద ప్రమాదం పెచ్చరిల్లుతుంది.
గడ్డం రమేష్‌
9490098484

Spread the love