ఎర్రి మెదల్లు మానై

ఎర్రి మెదల్లు మానైఅల్లు రాజ్యమేల అదుకున్నట్లు నటిస్తే
మన మీద పెద్దిరికం చేయ్య
ఒకొడు కాకపొతే ఇంకొకడికి
గులాం జేయ్య సిద్ధమయ్యే బతుకులు మానై

అల్లా తియ్యటి మాటలకు
పెదాల మీద ఆడిచ్చే సూక్తులకు
తడి బట్టలతో గొంతు గొసుకున
లైండ్లు కట్టే పోకడలు మానై

బజ్జీలు జోకి గడ్డి గోరిగిన
మనల్ని అధికార గుమ్మం అవల్నే
నిల్సుండ పెడుతున్న
అయినా అల్లకోసామే
మన జాతుల్ని అంగవెట్టే ఆత్రుతలు మానై
పొసే పెగ్గులకు, పడేసే బోక్కలకు
తోకడిచ్చే రీతులు మానై

అల్లా టైం పాస్‌ మాటల యుద్ధాలకు
అడ్డం పొడులు సుపిచ్చుకుంటు
తోడలు గోట్టి
తన్నుకు సచ్చే పౌరుషలు మానై

అల్లా సుఖలకోసం
మనకే తెలకుంట
మన రక్తమాంసాలు అండుకోని తింటున్న
నాంజుకోవడనికి
మనోల్లా మెదడుని కాల్సి దొల్లల ఏసి ఇచ్చే
పీస మనుసులు మానై

మన ఎర్రి మెదల్లకు ఇగురం అచ్చే దాక
సోయిదప్పి పన్న చైతన్యానికి చలనం అచ్చేదాక
బాంచెన్‌ బతుకుల్లో మార్పులు జారగై
– జి.యం.నాగేష్‌ యాదవ్‌
9494893625

Spread the love