Wednesday, August 12, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్మంత్రి సీతక్కను కలిసిన జుక్కల్ ఎమ్మెల్యే సతీమణి

మంత్రి సీతక్కను కలిసిన జుక్కల్ ఎమ్మెల్యే సతీమణి

- Advertisement -

నవతెలంగాణ-మద్నూర్
జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు సతీమణి తోట అర్చన రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, మహిళా, శిశు సంక్షేమ శాఖల మంత్రి దనసరి అనసూయ (సీతక్క)ను హైదరాబాద్‌లోని వారి నివాసంలో బుధవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా తమ కుమార్తె వివాహ మహోత్సవానికి హాజరై వధూవరులను ఆశీర్వదించాలని కోరుతూ వివాహ ఆహ్వాన పత్రికను మంత్రికి అందజేశారు. సీతక్క ఆహ్వాన పత్రికను సాదరంగా స్వీకరించి, నూతన వధూవరులకు ముందస్తు శుభాకాంక్షలు, ఆశీస్సులు తెలియజేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -