నవతెలంగాణ-పెద్దవూర
యాసంగి ధాన్యం మొత్తం ప్రభుత్వమే కొనుగోళ్లు చేస్తుందని రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని నాగార్జున సాగర్ ఎంఎల్ ఏ కుందూరు జయవీర్ రెడ్డి రైతులకు భరోసా ఇచ్చారు. గురువారం మండల కేంద్రం లోని సహకార వ్యవసాయం సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేద్రం మండల కేంద్రం లోని సబ్ మార్కెట్ యాడ్ లో ప్రారంభించి మాట్లాడారు.
కొనుగోలు కేంద్రాల్లో తేమ శాతం కొలిచే యంత్రాలు, కాంటాలు, టార్ఫాలిన్ కవర్లు, గన్నీ బ్యాగులు, ఇతరత్రా అన్ని సౌకర్యాలు కల్పించాలన్నారు. వరికోతలు ప్రారంభమైన నేపథ్యంలో రైతులు పండించి ధాన్యం ప్రభుత్వం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లో నే విక్రయించి మద్దతు ధర పొందాలని అన్నారు. దళారులను నమ్మి మోస పోవద్దని రైతులకు సూచించారు. ఎండిన ధాన్యం కొనుగోలు కేంద్రాలకు తీసుకురావాలని రైతులకు సూచించారు.కొనుగోలు కేంద్రాల్లో గన్నీ బ్యాగుల కొరత లేకుండా చూడాలన్నారు. అదే విధంగా కొనుగోలు కేంద్రాల్లోని ధాన్యం ఎప్పటికప్పుడు గోదాములకు తరలించేందుకు సరిపడా లారీలను అందుబాటులో ఉండే విధంగా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. రైతుల నుంచి ధాన్యం కొనుగోళ్లు చేసిన వెంటనే అధికారులు ట్యాబ్ లో ఎంట్రీ చేస్తే రెండు నుంచి మూడు రోజుల్లో రైతుల ఖాతాల్లో డబ్బులు జమ అవుతాయని తెలిపారు. ధాన్యం కొనుగోలు ప్రక్రియ సక్రమంగా జరిగేందుకు అందరూ అధికారులు సమన్వయంతో పని చేయాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ మాజీ వైస్ ఛైర్మెన్ కర్నాటి లింగారెడ్డి, హాలియా వ్యవసాయ మార్కెట్ ఛైర్మెన్ తుమ్మల పల్లి చంద్రశేఖర్ రెడ్డి,ఎంపీడీఓ సుధీర్ కుమార్, తహసీల్దార్ శ్రీనివాస్,వైస్ వైస్ ఛైర్మెన్ చంద్ర, కాంగ్రెస్ నాయకులు చింతూల చంద్రారెడ్డి,,పీఏసీఎస్ ఛైర్మెన్ గుంటుక వెంకట్ రెడ్డి,ఏఓసందీప్ రెడ్డి,సీఈఓ వదిరెడ్డి వెంకట్ రెడ్డి, మనోహర్, మండల కాంగ్రెస్ అధ్యక్షులు పబ్బు యాదగిరి, మార్కెట్ డైరెక్టర్ వూరే వెంకన్న,పాల్తీ శ్రీను, రమావత్ చీనా,సైదులు వెంకటయ్య తదితరులు పాల్గొన్నారు.