ఎమ్మెల్యేగా గెలిపించండి మూసి ప్రక్షాళన చేస్తాం

– కొండమడుగు నరసింహ సీపీఐ(ఎం) భువనగిరి నియోజకవర్గ అసెంబ్లీ అభ్యర్థి
నవతెలంగాణ -వలిగొండ: భువనగిరి అసెంబ్లీ నియోజకవర్గ సీపీఐ(ఎం) ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్న తనకు ఓటు వేసి  ఎమ్మెల్యేగా గెలిపిస్తే మూసి ప్రక్షాళనను సాధిస్తామని కొండమడుగు నరసింహ విజ్ఞప్తి చేశారు. బుధవారం మండల పరిధిలోని ఏదుళ్ళగూడెం, పొద్దుటూరు, వర్కట్ పల్లి గ్రామాల్లో తన ప్రచారాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత 40 సంవత్సరాల క్రితం త్రాగు సాగునీటి అవసరాలు తీర్చిన మూసి నది నేడు పాలకుల యొక్క నిర్లక్ష్యం కారణంగా పెద్ద ఎత్తున కాలుష్యం బారిన పడి ఇక్కడి ప్రాంత ప్రజల యొక్క ఆరోగ్యాలను నాశనం చేస్తుందని, అనేక అనారోగ్య సమస్యలతో మూసి పరివాహక ప్రాంతంలో ఉన్న ప్రజలు తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నారన్నారు. రెండుసార్లు ఎమ్మెల్యేగా పనిచేసిన ఫైళ్ల శేఖర్ రెడ్డి మూసి ప్రక్షాళన కోసం ఏ మాత్రం కృషి చేయలేదని కనీసం ఏ ఒక్క రోజు అసెంబ్లీలో మాట్లాడిన పరిస్థితి లేదని మళ్లీ ఈ ఎన్నికల్లో తనను ఓట్లు వేసి గెలిపించాలని గ్రామాల్లోకి వస్తున్నారని వారికి తగిన బుద్ధి చెప్పాలని ప్రజలను విజ్ఞప్తి చేశారు. నిరంతరం ప్రజా సమస్యల కోసం పనిచేస్తున్న సీపీఐ(ఎం) అభ్యర్థిగా సుత్తి కొడవలి నక్షత్రం గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. అదేవిధంగా ఏదుల్లగూడెం ప్రొద్దుటూరు గ్రామాలకు కనీస బస్సు సౌకర్యం కూడా లేదని తనను ఎమ్మెల్యేగా గెలిపిస్తే ఈ గ్రామాల నుండి భువనగిరికి వలిగొండకు బస్సు సౌకర్యం కోసం కృషిచేసి కల్పిస్తానని అన్నారు. పొద్దుటూరు వర్కట్ పల్లి గ్రామాల మధ్యన ఐ లెవల్లో మూసి బ్రిడ్జ్ నిర్మాణం చేపట్టాలని సిపిఎం అనేక దఫాలుగా పోరాటం నిర్వహించిందని తనను ఎమ్మెల్యేగా గెలిపిస్తే హై లెవెల్ బ్రిడ్జిని సాధించి తీరుతానని అన్నారు. అనేకమంది పేదలకు నేటికీ రేషన్ కార్డులు పెన్షన్లు అందడం లేదని వీటిపై ఇప్పటికే సీపీఐ(ఎం) నిర్వహించిన పోరాటాల్లో తాను ప్రత్యక్షంగా పాల్గొని పోరాటం నిర్వహించాలని పేదలకు ఇండ్లు ఇండ్ల స్థలాలు భూములు వ్యవసాయ కూలీలకు సమగ్రమైన చట్టం కోసం కృషి చేస్తానని కోరారు. ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు మాటూరి బాలరాజు గౌడ్, సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు మద్దెల రాజయ్య, మండల కార్యదర్శి సిర్పంగి స్వామి, జిల్లా కమిటీ సభ్యుడు గడ్డం వెంకటేష్, మద్దెపురం రాజు, మండల కార్యదర్శి వర్గ సభ్యులు తుర్కపల్లి సురేందర్,కల్కూరి రామచందర్,మండల నాయకులు ఏలే కృష్ణ, దుబ్బ లింగం, కవిడే సురేష్ పోతరబోయిన సత్యనారాయణ,సిర్పంగి శ్రీరాములు నాయకులు మెట్టు రవీందర్ రెడ్డి, మాడుగుల వెంకటేశం,చేగురి నరసింహ, పిట్టల అంజయ్య, పలుసం లింగం, పలుసం బాలయ్య, భూమి మాధవి పలుసం పూలమ్మ, ఉండ్రాటి పాపయ్య, బత్తుల నరసింహ,పెద్ద బోయిన భీమరాజు, కోరబోయిన కిరణ్,గొలనుకొండ స్వామి,గూడూరు బుచ్చిరెడ్డి,గోగు కిష్టయ్య, చేకూరి రాములు,రొండి  రాములు తదితరులు పాల్గొన్నారు.
Spread the love