
నవతెలంగాణ-చౌటుప్పల్ రూరల్: మునుగోడులో బీజేపీ, బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను ఓడించి నిరంతరం ప్రజా సమస్యలపై పోరాడే సీపీఐ(ఎం) ఎమ్మెల్యే అభ్యర్థి దోనూరి నర్సిరెడ్డిని గెలిపించాలని సీపీఐ(ఎం) కేంద్ర కమిటీ సభ్యులు మాజీ ఎమ్మెల్సీ చెరుపల్లి సీతారాములు శుక్రవారం పేర్కొన్నారు. చౌటుప్పల్ మండలం ధర్మోజిగూడెం గ్రామంలో సీపీఐ(ఎం) ఎమ్మెల్యే అభ్యర్థి దోనూరి నర్సిరెడ్డితో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా చెరుపల్లి సీతారాములు మాట్లాడుతూ ప్రజలు, రైతులు మునుగోడు నియోజకవర్గంలో కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ అభ్యర్థులను ఓడించి ప్రజల సమస్యలపై నిరంతరం పోరాడుతున్న సిపియం అభ్యర్థి దోనూరి నర్సిరెడ్డిని గెలిపించాలని సీపీఐ(ఎం) కేంద్ర కమిటీ సభ్యులు, మాజీ ఎమ్మెల్సి చెరుపల్లి సీతారాములు గారు పిలుపునిచ్చారు. కార్మికులు, వ్యవసాయ కూలీల హక్కుల కొరకు పోరాడింది కమ్యూనిస్టు లేనని అన్నారు. గ్రామీణ ఉపాధి హామీ చట్టం తెచ్చింది కమ్యూనిస్టులేనని అన్నారు. దేశ చరిత్రలో రైతు వ్యతిరేక చట్టాలను ఉపసంహరిం చుకొనేలా పెద్దఎత్తున పోరాటాలు చేసి ప్రధాని మోడీ మెడలు వంచిన చరిత్ర కమ్యూనిస్టులదని అన్నారు. మునుగోడు నియోజకవర్గంలో సాగు, త్రాగునీటికై పోరాడి సాధించింది కమ్యూనిస్టులేనని అన్నారు. కమ్యూనిస్టులు పోరాటం వలనే గ్రామాలలో ఇండ్ల స్థలాలు వచ్చాయని అన్నారు. మతం, కులం పేరుతో దాడులు దౌర్జన్యాలు చేస్తూ గత10 సంవత్సరాలుగా హమీలను అమలు చేయకుండా ప్రజలను మోసం చేసిన బీజేపీ, బీఆర్ఎస్, అవకాశవాద కాంగ్రెస్ పార్టీ లను ఓడించాలన్నారు. పూటకో పార్టీ మారుతూ రోజుకో కండువాలు వేసుకొని ఓట్లు అడుగుతున్న కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ అభ్యర్థులకు తగిన బుద్దిచెప్పాలన్నారు. ఈ ఎన్నికలలో మతోన్మాద బీజేపీని దాని మిత్రపక్షాలను ఓడించాలని అన్నారు పేద ప్రజల సమస్యల పరిష్కారమే ఎజెండాగా అనునిత్యం ప్రజల్లో ఉంటూ ప్రజా పోరాటాలు నిర్వహిస్తున్న సీపీఐ(ఎం) అభ్యర్థి దోనూరి నర్సిరెడ్డిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి ఎండి. జహంగీర్, రాష్ట్ర నాయకులు రఘుపాల్, డివైఎఫ్ఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆనగంటి వెంకటేష్, జిల్లా కమిటీ సభ్యులుు బూరుగు కృష్ణారెడ్డి, ఎండి పాషా, బండారు నర్సింహా మండల నాయకులు బొజ్జ బాలయ్య, బోయ యాదయ్య, చీర్క సంజీవ రెడ్డి, అలివేలు, మీసాల శీను, కాసం వెంకటేష్, పురుషోత్తం, మహేష్, శ్రీనివాస్ రెడ్డి, నాగరాజు రెడ్డి, మాదార్, ఎల్లయ్య తదితరులు పాల్గొన్నారు.
