నేటి సమాజంలో మహిళలు అన్ని రంగాల్లో రాణించాలని.. తల్లిదండ్రులు తమ పిల్లల పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలని మైనార్టీ రెసిడెన్షియల్ పాఠశాల ప్రిన్సిపాల్ జీ.విమల అన్నారు.మార్చి 8 న అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని మహిళలందరికీ శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం వారు మాట్లాడుతూ.. ఎంత ఎదిగినా ఒదిగి ఉండడం నేర్చుకోవాలన్నారు. ఉన్నత స్థాయిల్లో ఉన్న మహిళలు.. పేద, ధనిక తారతమ్యాలు చూడకుండా సాటి మహిళలకు ప్రాధాన్యమివ్వాలన్నారు. పరిమిత స్వేచ్ఛతో.. స్వతంత్రంగా బతకాలని, మహిళలు తమ సహజత్వాన్ని నిలుపుకోవాలని సూచించారు.