ఆషాడం పురస్కరించుకుని మహిళలు అమ్మవారికి మొక్కుబడులు చెల్లించుకున్నారు. ఆదివారం పట్టణంలోని మద్దిరావమ్మ ఆలయం, వడ్డెర బజార్ ముత్యాలమ్మ అమ్మవారి సన్నిధిలో వేరు వేరుగా ఆషాడం బోనాలను అమ్మవారికి సమర్పించారు. ఈ సందర్భంగా బోనాలను నెత్తిన దరించి తీన్మార్ డప్పు వాయిద్యాలతో పట్టణంలోని పలు దేవాలయాలను దర్శించుకున్నారు.వడ్డెర బజార్, కోట మైసమ్మ, లక్ష్మీగణపతి ఆలయం, అభయాంజనేయ స్వామి,కోనేరు ముత్యాలమ్మ దేవాలయాలను దర్శించుకున్న తరువాత డ్రైవర్స్ కాలనీలోని కనకదుర్గ అమ్మవారి ఆలయంలో బోనాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. ఈ వేడుకలో అధిక సంఖ్యలో మహిళలు పాల్గొన్నారు.