సీఐటీయూ ఆద్వర్యంలో మహిళా దినోత్సవం

Women's Day under the auspices of CITU– హాజరైన జిల్లా నాయకురాలు పద్మ
నవతెలంగాణ – అశ్వారావుపేట
మహిళలకు ఓటు హక్కు, వారి పై జరుగుతున్న క్రూరమైన దోపిడీకి, పని పరిస్థితులు పై వ్యతిరేకంగా మహిళా కార్మికులు చేసిన పోరాటాల ఫలితంగా ఏర్పడిందే ఈనాడు జరుపుకుంటున్న అంతర్జాతీయ శ్రామిక మహిళా దినోత్సవం అని సీఐటీయూ జిల్లా కోశాధికారి జి.పద్మ అన్నారు. శనివారం స్థానిక ప్రజా సంఘాల కార్యాలయం సుందరయ్య భవన్ లో సీఐటీయూ ఆధ్వర్యంలో అంతర్జాతీయ శ్రామిక మహిళా దినోత్సవాన్ని కట్ట రాధ అధ్యక్షతన నిర్వహించారు. పురవీధుల్లో ప్రదర్శన నిర్వహించిన అనంతరం ఈ సందర్భంగా పద్మ మాట్లాడుతూ.. మహిళలకు సమానత్వం, న్యాయం, దోపిడి, వివక్ష రూపుమాపేవరకు మహిళా లోకం అలుపెరగని పోరాటాలు నిర్వహించాలని అన్నారు. అంగన్వాడి, ఆశ, మధ్యాహ్న భోజనం వర్కర్స్ ను కార్మికులకు గుర్తించాలని వారికి కనీస వేతనాలు చట్టబద్ధ సౌకర్యాలు కల్పించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు పిట్టల అర్జున్,ఐద్వా మండల నాయకురాలు నిర్మల, భారతి, యామిని, నాగమణి, రాజేశ్వరి, రమణ, విజయ, నాగ, దుర్గ తదితరులు పాల్గొన్నారు.

Spread the love