ఎమ్మెల్యేను సన్మానించిన మహిళా సంఘాలు 

Women's groups honored MLA– నిధులు మంజూరు చేయాలని వినతి 

నవతెలంగాణ – జక్రాన్ పల్లి 
నిజాంబాద్ రూరల్ ఎమ్మెల్యేను ఉప్పాలపల్లి గ్రామ మహిళా సంఘాలు శాలువాతో పూలమాలతో ఘనంగా సన్మానించారు. మండలంలోని పలు అభివృద్ధి కార్యక్రమాలకు ముఖ్య అతిథిగా వచ్చిన నిజాంబాద్ రూరల్ ఎమ్మెల్యే భూపతిరెడ్డిని పుప్పాలపల్లి గ్రామంలో సన్మానించి, మహిళా గ్రామ సంఘం భవన ప్రవాహరి గోడ నిర్మాణానికి నిధులు మంజూరు చేయాలని ఎమ్మెల్యేకు వినతిపత్రం సమర్పించారు. ఈ కార్యక్రమంలో మహిళా గ్రామ సంఘం అధ్యక్షురాలు, ఉపాధ్యక్షురాలు కార్యదర్శి కోశాధికారి సహాయ కార్యదర్శి వివోఏ కవిత మహిళా సంఘాల సభ్యులు పాల్గొన్నారు.
Spread the love