- Advertisement -
సర్పంచ్ మడి ప్రవీణ్ కుమార్
నవతెలంగాణ-కుభీర్
మహిళలు అన్ని రంగాల్లో ముందుండాలని స్థానిక సర్పంచ్ మడి ప్రవీణ్ కుమార్ అన్నారు. శుక్రవారం మండలంలోని పార్డి (బి ) గ్రమైక్య సంఘం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ..మహిళలకు అవసరమైన అన్ని రకాల రుణాలు అందించి, వారికి ఆర్థికంగా సహాయపడేందుకు కృషి చేస్తామని తెలిపారు. బ్యాంక్ లు అందించిన రుణాలను క్రమం తప్పకుండ రుణాలు చెల్లిస్తే మరింత ఎక్కువ రుణాలు పొందేలా తోడ్పడుతుందన్నారు. దింతో పాటు సెర్ప్ మొక్క పాలు విషయాలు మహిళలకు సీసీ పరుశురాం వివరించారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి భూమేష్, సి ఏ సాయినాథ్, మహిళా సంఘం అధ్యక్షురాలు గుమ్మల, లావణ్య, మహిళలు తదితరులు ఉన్నారు.
- Advertisement -



