Friday, August 7, 2026
E-PAPER
Homeజిల్లాలుసీఎం రేవంత్ రెడ్డి పర్యటన ఏర్పాట్లను సమీక్షించిన ఎమ్మెల్యే రేవూరి

సీఎం రేవంత్ రెడ్డి పర్యటన ఏర్పాట్లను సమీక్షించిన ఎమ్మెల్యే రేవూరి

- Advertisement -

నవతెలంగాణ – పరకాల
పరకాల నియోజకవర్గంలో ఆగస్టు 16న రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటించనున్న నేపథ్యంలో చేపట్టిన ఏర్పాట్లను పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి అధికారులు, ప్రజాప్రతినిధులతో కలిసి శుక్రవారం సమీక్షించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి పర్యటన సందర్భంగా నియోజకవర్గంలో పలు అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు నిర్వహించనున్నట్లు తెలిపారు.

ఈ పర్యటనను విజయవంతం చేసేందుకు అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి అవసరమైన ఏర్పాట్లను సకాలంలో పూర్తి చేయాలని ఆదేశించారు.ముఖ్యమంత్రి పర్యటనలో భాగంగా 100 పడకల ప్రభుత్వ ఆసుపత్రి, నూతన డిగ్రీ కళాశాల, పరకాల ఇందిరా మహిళా డెయిరీ, ఏటీసీ సెంటర్‌తో పాటు పలు అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు జరగనున్నట్లు ఎమ్మెల్యే వెల్లడించారు. ఈ కార్యక్రమంలో పిసిసి మాజీ ఉపాధ్యక్షులు దొమ్మటి సాంబయ్య, మున్సిపల్ చైర్మన్ పావుశెట్టి సునీల్,కౌన్సిలర్ల కొయ్యడ శ్రీనివాస్,బండి కిరణ్, ఆర్డీవో డిఎస్ వెంకన్న,సిఐ క్రాంతికుమార్వి,విధ శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొని పర్యటన ఏర్పాట్లపై చర్చించి అవసరమైన సూచనలు చేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -