Friday, August 7, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ఉపాధ్యాయుల సమస్యలను వెంటనే పరిష్కరించాలి

ఉపాధ్యాయుల సమస్యలను వెంటనే పరిష్కరించాలి

- Advertisement -

ఆగస్టు 15 లోపు పిఆర్సిని ప్రకటించి,అమలు చేయాలి
టీఎస్ యుటిఎఫ్ అధ్యక్షుడు నక్క తిరుపతి
నవతెలంగాణ – మల్హర్ రావు

ప్రభుత్వ పాఠశాలల, ఉపాధ్యాయుల సమస్యలను ఆగస్టు 15లోపు పరిస్కారం చేయాలని టిఎస్ యుటిఏప్ జిల్లా అధ్యక్షుడు నక్క తిరుపతి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.శుక్రవారం ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటీ పిలుపు తాడిచెర్ల జిల్లా ఉన్నత పాఠశాల ఉపాధ్యాయులు,సమగ్ర శిక్ష ఉద్యోగులు  నల్ల బ్యాడ్జీలు ధరించి  పాఠశాల విధులకు హాజరై, భోజన విరామ సమయంలో తమ న్యాయమైన డిమాండ్ల సాధన కోసం నిరసన ప్రదర్శన నిర్వహించారు.ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ (టీఎస్ యుటిఎఫ్) జిల్లా అధ్యక్షుడు మండలంలో వివిధ పాఠశాలలను సందర్శించి మాట్లాడారు పాఠశాలల,ఉపాధ్యాయుల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటీ (యూఎస్పిసి)ఆధ్వర్యంలో అనేకసార్లు విజ్ఞప్తి చేసినప్పటికీ ప్రభుత్వం నుండి ఎలాంటి సానుకూల స్పందన రాకపోవడంతో అనివార్యంగా నాలుగు దశల పోరాట కార్యక్రమాన్ని ప్రకటించడం జరిగిందని తెలియజేశారు.

ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం ఆగస్టు 15 లోపు పిఆర్సి నివేదికను తెప్పించుకొని 01.07.2023 నుండి అమలు చేయాలని డిమాండ్ చేశారు.పెండింగ్‌లో ఉన్న ఆరు డిఎలను వెంటనే విడుదల చేయాలన్నారు.కాంగ్రెస్ ప్రభుత్వం మేనిఫెస్టోలో ప్రకటించిన ప్రకారం  సిపిఎస్ విధానాన్ని వెంటనే రద్దు చేయాలన్నారు.కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయల్లో ,అర్బన్ రెసిడెన్షియల్ పాఠశాలలో పనిచేస్తున్న ఉపాధ్యాయులు, ఉద్యోగులతో పాటు సమగ్ర శిక్షలు పనిచేస్తున్న ఉద్యోగులందరికీ వెంటనే మినిమం టైం స్కేల్  ను వెంటనే వర్తింప చేయాలన్నారు.విద్యాశాఖలో ఖాళీగా ఉన్న పర్యవేక్షణ పోస్టులను భర్తీ చేయాలన్నారు.ఉపాధ్యాయల బదిలీలు మరియు పదోన్నతుల షెడ్యూల్ వెంటనే ప్రకటించాలని డిమాండ్ చేశారు.రేషనలైజేషన్ జిఓ 25ను సవరించి ప్రతి ప్రాథమిక పాఠశాలకు కనీస ఇద్దరు టీచర్లు ,40 మంది విద్యార్థులున్న ప్రాథమిక పాఠశాలలకు ఐదుగురు టీచర్లను కేటాయించాలన్నారు.గురుకులాలు,మోడల్ స్కూల్ ఉపాధ్యాయులకు 010 హెడ్ కింద వేతనాలు చెల్లించాలన్నారు.అందరికీ అందుబాటులో గల ప్రభుత్వ పాఠశాలల కుదింపు ప్రక్రియను నిలిపివేయాలని డిమాండ్ చేశారు.

జి ఓ 317 కారణంగా స్థానికత కోల్పోయిన ఉపాధ్యాయులు ఉద్యోగులను తమ స్థానిక జిల్లాకు బదిలీ చేయాలని డిమాండ్ చేశారు.పిఆర్సిని అమలు చేసేంతవరకు జిల్లాలోని ఉపాధ్యాయులందరూ ప్రతిరోజు నల్ల బ్యాడ్జిని ధరించి విధులకు హాజరుకావాలని విజ్ఞప్తి చేశారు.ఈనెల 12,13 తేదీల్లో జిల్లాలోని అన్ని తహసిల్దారు కార్యాలయాల ఎదుట  నిరసన ప్రదర్శన నిర్వహించాలన్నారు.ఆగస్టు 15 లోపు  ప్రభుత్వం నుండి ఎలాంటి సానుకూల నిర్ణయం వెలబడకపోతే ఆగస్టు 19వ తేదీన జిల్లా కేంద్రాల్లో,ఆగస్టు 29వ తేదీన రాష్ట్ర కేంద్రంలో వేలాదిమంది ఉపాధ్యాయులతో మహాధర్నా నిర్వహించడం జరుగుతుందన్నారు.ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి కోడెపాక రమేష్,మండల బాధ్యులు శర్మ, యోగానంద్,పూర్ణ, స్వర్ణలత,శ్రీధర్, యాకూబ్ పాషా,చంద్ర ప్రకాష్,మానస, సుజాత,మిట్ట రమేష్ తాడిచెర్ల,మల్లారం పెద్ద తూండ్ల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలల ఉపాధ్యాయులు,సమగ్ర శిక్ష ఉద్యోగులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -