Friday, August 7, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్శాంభవి హైస్కూల్ ఆధ్వర్యంలో ఘనంగా బోనాలు

శాంభవి హైస్కూల్ ఆధ్వర్యంలో ఘనంగా బోనాలు

- Advertisement -

నవతెలంగాణ-బాల్కొండ 
మండల కేంద్రంలోని శాంభవి హై స్కూల్ శుక్రవారం ఘనంగా బోనాలు నిర్వహించారు. స్కూలు నుంచి గ్రామంలోని పెద్ద పోచమ్మ వరకు స్కూల్ విద్యార్థులు బ్యాండ్ మేళంతో పోతరాజుల విన్యాసాలు, నృత్యాలు చేశారు. విద్యార్థులు చేసిన నృత్యాలు చూపరులను ఆకట్టుకున్నాయి. ఈ సందర్భంగా పాఠశాల చైర్మన్ బొట్ల మధుసూదన్ రాజు మాట్లాడుతూ పాఠశాల ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం ఇలాగే ఈ సంవత్సరం కూడా పెద్ద ఎత్తున బోనాల పండుగ జరుపుకోవడం చాలా ఆనందదాయకం అని అన్నారు. ఈ కార్యక్రమంలో కరస్పాండెంట్ రవీన్ ప్రసాద్, ప్రిన్సిపల్ ఇంద్రాణి, వైస్ ప్రిన్సిపాల్ మంజుల, ఉపాధ్యాయ బృందం తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -