ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి


కార్పొరేటర్‌ జంగం శ్వేతా మధుకర్‌ రెడ్డి
నవతెలంగాణ- సంతోష్‌ నగర్‌
ఐఎస్‌సదన్‌ డివిజన్‌ పరిధిలోని కాలనీలు, బస్తీలల్లో ఉన్న ప్రజా సమస్యలను పరిష్కరించేందుకు కృషిచేస్తానని కార్పొరేటర్‌ జంగం శ్వేతా మధుకర్‌ రెడ్డి అన్నారు. ఇటీవల డివిజన్‌ పరిధిలోని కష్ణానగర్‌లో కార్పొరేటర్‌ పర్యటించినప్పుడు స్థానికులు కాలనీలో ఉన్న సమస్యను ఆమె దృష్టికి తీసుకొచ్చారు. స్పందించిన కార్పొరేటర్‌ వాటర్‌ వర్క్స్‌ అధికారులతో చర్చించారు. ఈ మేరకు ఆదివారం బకెట్‌ వాహనం, సిబ్బందిని రప్పించి కష్ణానగర్‌లోని డ్రైనేజీ పూడిక తీయించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ కాలనీలు, బస్తీలల్లో మౌలిక వసుతులు కల్పించడానికి తన వంతు సహాయ సహకారాలు అందిస్తానని హామీ ఇచ్చారు. డివిజన్‌ పరిధిలో ఎక్కడైనా ఏదేని సమస్య ఉంటే తన దష్టికి తీసుకురావాలని స్థానికులను కోరారు. వెంటనే సంబంధిత అధికారులతో చర్చించి దానిని పరిష్కరిస్తామని భరోసా ఇచ్చారు.ి

Spread the love