
నవతెలంగాణ -దుబ్బాక : మార్చి 5 నుండి ప్రారంభం కానున్న ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షలకు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని .. విద్యార్థులు ఆందోళన చెందకుండా ప్రశాంత వాతావరణంలో పరీక్షలు రాసి ఉత్తమ ఫలితాలు సాధించాలని సిద్ధిపేట జిల్లా ఇంటర్మీడియట్ అధికారి (డీఐఈఓ) కే.రవీందర్ రెడ్డి సూచించారు.ఇంటర్మీడియట్ బోర్డ్ కార్యదర్శి,కమిషనర్ కృష్ణ ఆదిత్య ఆదేశాల మేరకు జిల్లాలోని అన్ని ప్రయోగం పరీక్ష కేంద్రాల్లో సీసీ కెమెరాలను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు.సోమవారం దుబ్బాక లోని ప్రభుత్వ జూనియర్ కళాశాల,వాగ్దేవి జూనియర్ కళాశాలల్ని ఆయన సందర్శించి ప్రాక్టికల్స్ జరుగుతున్న తీరును పరిశీలించారు.అనంతరం వారు మాట్లాడుతూ..ఈనెల 3 నుండి 22 వరకు ఇంటర్మీడియట్ ప్రాక్టికల్స్ జరుగుతాయన్నారు.జిల్లా వ్యాప్తంగా ఏర్పాటు చేసిన 62 కేంద్రాల్లో 11,090 విద్యార్థులు పరీక్షలకు హాజరవుతున్నట్లు వెల్లడించారు.ఆయన వెంట జిల్లా పరీక్షల నిర్వహణ కమిటీ సభ్యులు గంగాధర్,ప్రభుత్వ జూనియర్ కళాశాల ఇన్చార్జి చీఫ్ సూపరింటెండెంట్ శివకుమార్,పలువురు కళాశాల సిబ్బంది ఉన్నారు.