నవతెలంగాణ-హైదరాబాద్ : నేచురల్ స్టార్ నాని, టాలెంటెడ్ డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల క్రేజీ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న మోస్ట్ అంటెసిపేటెడ్ పాన్ ఇండియా మూవీ ‘ది ప్యారడైజ్’ (The Paradise) నుంచి మేకర్స్ క్రేజీ అప్‌డేట్‌ను అందించారు. ఈ చిత్రం నుంచి రెండో సింగిల్‌గా మోస్ట్ పాపులర్ ఫోక్ సాంగ్ అయిన ‘యెష నాగుల కట్ట మీద’ పాటను డిజిటల్ వేదికగా విడుదల చేశారు.
తెలంగాణ నేటివిటీని ప్రతిబింబించేలా సాగే ఈ జానపద గీతాన్ని సినిమాలో మరింత మాస్ వైబ్‌తో రీమిక్స్ వెర్షన్‌గా తెరకెక్కించారు. ఇప్పటికే సోషల్ మీడియాలోనూ, ప్రజల నోళ్లలోనూ నానుతున్న ఈ పాటకు అనిరుధ్ రవిచందర్ అందించిన రాకింగ్ మాస్ బీట్స్ ప్రధాన ఆకర్షణగా నిలవనున్నాయి. ‘దసరా’ బ్లాక్‌బస్టర్ తర్వాత నానితో పాటు తెరపై ఈ పాటకు రాబోయే మాస్ స్టెప్స్ సినిమాపై అంచనాలను తారాస్థాయికి చేర్చుతున్నాయి. ఈ క్యాచీ సాంగ్‌కు కాసర్ల శ్యామ్ సాహిత్యాన్ని అందించగా, జంగి రెడ్డి మరియు సింగర్ ప్రభ తమ శక్తివంతమైన గాత్రంతో ప్రాణం పోశారు. ఎస్.ఎల్.వి. సినిమాస్ బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి అత్యంత భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్న ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా సెప్టెంబర్ 24, 2026న గ్రాండ్‌గా ప్రేక్షకుల ముందుకు రానుంది



