నువ్వా.. నేనా..

– కుల సంఘాల మద్దతు కోసం అభ్యర్థులు
– జోరందుకున్న ఇంటింటా ప్రచారం
నవతెలంగాణ- చందుర్తి
వేములవాడ నియోజక వర్గంలో అసెంబ్లీ ఎన్నికల నేపద్యం లో రెండు ప్రధాన పార్టీల అభ్యర్థుల ప్రచారం జోరుగా సాగుతోంది. కుల సంఘాల పై అభ్యర్థులు ఫోకస్ పెట్టి వారికి సంఘాల అభివృద్ధి కోసం హామీల వర్షం కురిపిస్తున్నారు. దీంతో కుల సంఘాల పెద్ద మనుషులు ప్రత్యేక సమావేశాలు పెట్టి ఓట్ల తీర్మానం చేస్తున్నారు.
ఇద్దరి మధ్యే పోటీ
బీఆర్ఎస్ అభ్యర్థి లక్ష్మి నర్సింహా రావు, కాంగ్రేస్ అభ్యర్థి అది శ్రీనివాస్ మద్యే పోటీ నెల కొంది.ఇప్పటి వరకు భాజపా అభ్యర్థిని ఆ పార్టీ ప్రకటించక పోవడం, మరో వైపుగా బీఎస్పీ అధిష్టానం గోలి మోహన్ ను ప్రకటించగా ఆయన ఇప్పటి వరకు ప్రచారంలోకి అడుగు పెట్టలేదు దింతో రెండు ప్రధాన పార్టీల అభ్యర్థుల మధ్య పోటీ మారింది.
జోరందుకున్న ఇంటింటా ప్రచారం
వేములవాడ నియోజకవర్గంలో ఆరుమండలాల పరిధి లో 120 గ్రామాల లో రెండు లక్షల ఓటర్లు ఉన్నారు. దీంతో అభ్యర్థులు గ్రామాల్లో ఉదయమే పోటా పోటీగా ఇంటింటా ప్రచార పర్వం చేస్తు కుల సంఘాల మద్దతు కూడా గట్టు కుంటున్నారు. అభ్యర్థుల కుటుంబ సభ్యులు కూడా ఎలక్షన్ ప్రచారం లో ఇంటాట ప్రచారం లో బిజీగా ఉన్నారు.దీంతో నువ్వా..నేనా అన్నట్లుగా గెలుపు దిశగా అభ్యర్గులు అడుగులేస్తున్నారు.

Spread the love