
అంగన్‌వాడీ టీచర్లు జీవితంలో యోగాను బాగస్వామ్యం చేసుకోవాలని జిల్లా సంక్షేమ అధికారిణి కేవి కృష్ణవేణి అన్నారు. గురువారం అంతర్జాతీయ యోగా దినోత్సవం పురష్కరించుకుని ఏయిమ్స్ ఆస్పత్రి ఆధ్వర్యంలో అవగాహాన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు ఇందులో భాగంగా భువనగిరి ఐసీడీఎస్ ప్రాజెక్ట్ కార్యాలయంలో అంగన్‌వాడీ టీచర్లు యోగాపై అవగాహాన కల్పించి యోగా హాసనాలు వేయించారు. ఈ సందర్భంగా జిల్లా సంక్షేమ అధికారి మాట్లాడుతూ.. ప్రతి రోజు హాడవుడి జీవితంలో యోగా అనేది అలవాలు చేసుకుంటే ఒత్తిడికి దూరం కావచ్చాన్నారు. కేంద్రాలలో పిల్లలకు, లబ్దిదారులకు యోగాపై అవగాహాన కల్పించాలని ఆదేశించారు. ఈకార్యక్రమంలో ఐసీడీఎస్ ప్రాజెక్ట్ అధికారిణి రేఖల స్వరాజ్యం, అంగన్‌వాడీ సూఫర్‌వైజరుల, ఎయిమ్స్ యోగా ప్రచార ప్రతినిధులు పాల్గొన్నారు.