
నవతెలంగాణ-ఆదిలాబాద్ టౌన్
జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల సైన్స్ లో మార్చ్ 22న జిల్లాస్థాయి యువజన ఉత్సవ పోటీలు నిర్వహించనున్నట్లు కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ జే.సంగీత, నెహ్రూ యువజన కేంద్ర జిల్లా కోఆర్డినేటర్ సుశీల్ బడ్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. మార్చ్ 22న నిర్వహించే జిల్లా యువజన ఉత్సవ పోటీలలో 15-29 మధ్య వయసు గల డిగ్రీ చదివినా లేదా చదువుతున్న యువతీ యువకులు పాల్గొనవచ్చని పేర్కొన్నారు. సైన్స్ ఎగ్జిబిషన్ (వ్యక్తిగత మరియు బృంద క్యాటగిరి), పెయింటింగ్, మొబైల్ ఫోటోగ్రఫీ, కవితా రచన, ఉపన్యాస పోటీ, సంస్కృతిక నృత్య విభాగం (వ్యక్తిగత బృందా కేటగిరి), పోటీలో గెలుపొందిన వ్యక్తిగత బృందా క్యాటగిరీలకు ప్రధమ ద్వితీయ తృతీయ బహుమతులు నగదు రూపంలో అందజేస్తామని పేర్కొన్నారు. ఆసక్తిగల యువతీ యువకులు కళాశాల లో సంప్రదించాలని సూచించారు.