నవతెలంగాణ – పెద్దవూర
నల్గొండ జిల్లా పెద్దవూర మండలం పులిచర్ల గ్రామానికి చెందిన దండు జానయ్య ఇటీవల కొద్ది రోజుల క్రితం అకాల మరణం చెందారు. వారి కుటుంబ సభ్యులకు సానుభూతి తెలియజేస్తూ శనివారం సాధన యువజన సంఘం వారి ఆధ్వర్యంలో ఒక నెల రోజులకు సరిపడే సరుకులను బియ్యం, పప్పు, చింతపండు, వంట నూనె,కూరగాయలు వారి కుటుంబ సభ్యులకు అందించారు. ఈ సందర్బంగా సాధన యువజన సంఘం సభ్యులు మాట్లాడుతూ..జానయ్య నిరుపేద బకుటుం వారి కుటుంబానికి ఇంకా ఎవరైనా దాతలు ముందుకు వచ్చి ఆర్థిక సహాయం చేసి కుటుంబ సభ్యులను ఆడుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో సాధన యువజన సంఘం సభ్యులు,బుడిగపాక సత్యనారాయణ, బొడ్డుపల్లి చిరంజీవి, కంబంపాటి కృష్ణ తదితరులు పాల్గొన్నారు.