పోలీసుల అదుపులో గంజాయి తరలిస్తున్న యువకులు

నవతెలంగాణ – కొనరావుపేట
అక్రమంగా గంజాయి తరలిస్తున్న ఇద్దరు యువకులను పోలీసులు పట్టుకొని అదుపులోకి తీసుకున్నట్టు సమాచారం.మండలంలోని  మర్తనపేట గ్రామం వద్ద ద్విచక్ర వాహనాలను పోలీసులు తనిఖీలు చేస్తుండగా కొలనూరు గ్రామానికి చెందిన ఇద్దరు యువకులు ద్విచక్ర వాహనంపై అనుమానస్పదంగా తిరుగుతుండగా వెంటనే వారిని పట్టుకొని తనిఖీ చేయగా వారి వద్ద 750 గ్రాములు గంజాయి లభ్యమైనట్లు సమాచారం. వీరికి గంజాయి ఎవరు విక్రయించారనే కోణంలో పోలీసులు విచారణ చేస్తున్నారు.
Spread the love