ఎస్సై ఏడుకొండలు ను సన్మానించిన యూత్ కాంగ్రెస్ నాయకులు

నవతెలంగాణ –  తుంగతుర్తి
తుంగతుర్తి మండల నూతన ఎస్సైగా పదవీ బాధ్యతలు చేపట్టిన ఏడుకొండలును శనివారం యూత్ కాంగ్రెస్ నాయకులు ఘనంగా శాలువాతో సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మండలంలో ఫిర్యాదుదారులకు న్యాయం జరిగేలా, శాంతి భద్రతల పరిరక్షణకు కృషి చేయాలని కోరారు. కార్యక్రమంలో యువజన కాంగ్రెస్ నియోజకవర్గ ఉపాధ్యక్షులు కొమ్ము జోహార్, నవీన్, విఠల్, జలంధర్, హరీష్, అశోక్, రంజిత్ తదితరులు పాల్గొన్నారు.
Spread the love