యువత నేతాజీని స్పూర్తిగా తీసుకోవాలి

నవతెలంగాణ-పాపన్నపేట
అహింసా వాదంతోనే స్వరాజ్యం సిద్దిస్తుందని నమ్మి గాంధీజీ, మొదలైన నాయకులందరూ పోరాటం చేస్తుంటే నేతాజీ మాత్రం సాయుధ పోరాటం ద్వారానే ఆంగ్లేయులను దేశం నుంచి తరిమికొట్టవచ్చని నమ్మి ఆచరణలో పెట్టిన వ్యక్తి అని సర్పంచ్‌ గురుమూర్తి గౌడ్‌, ఏఎస్‌ఐ సంగన్నలు పేర్కొన్నారు. నేతాజీ జయంతిని పురస్కరించుకొని మంగళవారం పాపన్నపేట చౌరస్తాలో ఉన్న సుభాష్‌ చంద్రబోస్‌ విగ్రహానికి గ్రామస్తులతో కలిసి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం వారు మాట్లాడుతూ నేతాజీ ఏర్పాటు చేసిన ఆజాద్‌ హింద్‌ పౌజ్‌లో అనేకమంది ముస్లింలు, హిందువులు, సిక్కులు ఉన్నతమైన పదవుల్లో కమాండర్‌ స్థాయిలో ఉన్నారని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ ఆకుల శ్రీనివాస్‌, సుంకరి సాయిలు, బీకొండ రాములు, నిట్టలాక్షప్ప, గజవాడ రాజేశ్వర్‌, సుంకరి కృష్ణ, మఠం సతీష్‌, సుదర్శన్‌ పంతులు, తదితరులు పాల్గొన్నారు.
నవతెలంగాణ-మనోహరాబాద్‌
నేతాజి సుబాష్‌ చంద్రబోస్‌ను యువతీ యువకులు ఆదర్శంగా తీసుకుని సమాజ శ్రేయస్సుకు పాటుపడాలని బీఆర్‌ఎస్‌ పార్టీ ఉద్యమ నాయకులు మన్నె శ్రీనివాస్‌రావ్‌, బీసీ సంక్షేమ సంఘం జిల్లా ఉపాధ్యక్షులు చిన్నలింగ్‌ మల్లికార్జున్‌గౌడ్‌లు కోరారు. నేతాజి సుబాష్‌ చంద్రబోస్‌ 127వ జయంతి ఉత్సవాలను తూప్రాన్‌ మున్సిపల్‌ కేంద్రంలో నిర్వహించారు. సుబాష్‌ చంద్రబోస్‌ విగ్రహానికి పూల మాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ ఆజాద్‌ హింద్‌ ఫౌజ్‌ను ఏర్పాటు చేసిన దేశ భక్తుడు సుబాష్‌ చంద్రబోస్‌ను యువత ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు. సుభాష్‌ చందబ్రోస్‌లాంటి దేశ భక్తులను యువత ఆదర్శంగా తీసుకుని ముందుకు వెళ్లాలన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ 15వ వార్డు అధ్యక్షులు బాయికాడి అంజనేయులు, ఎంఆర్‌పీఎస్‌ జిల్లా మహిళా విబాగం అధ్యక్షురాలు పల్లెపాటి మాధవి, వెంకట్‌, రవిచారి తదితరులు పాల్గొన్నారు.
నవతెలంగాణ-టేక్మాల్‌
నేతాజీని నేటి యువత స్పూర్తిగా తీసుకొని ముందుకు పోవాలని బీజేపీ మండల అధ్యక్షులు ఎల్లుపేట రాజు అన్నారు. సుభాష్‌ చంద్రబోస్‌ 127వ జయంతి, పరాక్రమ దివస్‌ వేడుకలను బీజేపీ ఆధ్వర్యంలో మంగళవారం టేక్మాల్‌లో నిర్వహించారు. సుభాష్‌ చంద్రబోస్‌ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. నేతాజీ దేశానికి చేసిన సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో బీజేపీ అధ్యక్షుడు ఎల్లుపేట రాజు, మండల్‌ ప్రధాన కార్యదర్శి ఎల్లంపల్లి నాగరాజు, వడ్డె రాములు, మండల ఎస్‌టీ మోర్చా అధ్యక్షులు చౌహాన్‌ సేనాపతి, సిద్ధిరాములు తదితరులు పాల్గొన్నారు.
నవతెలంగాణ -వెల్దుర్తి
మండల పరిధిలో కొప్పులపల్లి గ్రామంలో నేతాజీ సుభాష్‌ చంద్రబోస్‌ జయంతి వేడుకలను మంగళవారం ఘనంగా నిర్వమించారు. ప్రాథమికోన్నత పాఠశాల విద్యార్థులు, ఉపాధ్యాయులు స్థానిక సంఘసంస్కర్త పోచయ్య ఆధ్వర్యంలో గ్రామ చావిడి వద్దకు భారీ ర్యాలీ నిర్వహించారు. సుభాష్‌ చంద్రబోస్‌ అమర్‌హై అంటూ ర్యాలీగా బయలుదేరి సుభాష్‌ చంద్రబోస్‌ విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా పాఠశాల ఉపాధ్యాయులు మాట్లాడారు తొలిగా ఇండియన్‌ ఆర్మీని తయారు చేశౄరన్నారు. భారత స్వాతంత్ర సమరయోధుడు ఆజాద్‌ హింద్‌ పౌస్‌ సృష్టికర్త ఎందరికో ఆదర్శంగా నిలిచిన మహా వ్యక్తి అన్నారు. పోచయ్య మాట్లాడుతూ దేశం కోసం అహర్నిశలు కష్టపడి బ్రిటిష్‌ వారికి ఎదురొడ్డి రక్తాన్ని మీకు ఇస్తా, స్వాతంత్య్రాన్ని మాకు ఇవ్వండి అంటూ పోరాడిన వ్యక్తి సుభాష్‌ చంద్రబోస్‌ అన్నారు. ఆయనను ఆదర్శంగా తీసుకొని విద్యార్థిని విద్యార్థులు సుభాష్‌ చంద్రబోస్‌ బాటలో నడవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు ఉపాధ్యాయులు అంగన్వాడి టీచర్లు పాల్గొన్నారు.

Spread the love