Wednesday, September 2, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్జుక్కల్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో వైఎస్ఆర్ జయంతి వేడుకలు

జుక్కల్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో వైఎస్ఆర్ జయంతి వేడుకలు

- Advertisement -

నవతెలంగాణ – జుక్కల్ : జుక్కల్ మండల కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో బుధవారం నాడు జీవంగాత మాజీ ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి జయంతి వేడుకల్లో జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు పాల్గొని నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన జయతి వేడుకలు వైయస్సార్ చిత్రపటానికి పూలమాలవేసి నివాళులు అర్పించి జయంతి వేడుకలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు మాట్లాడుతూ పేదల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిన జననేత అనుకొని ఆడారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ తెలుగు ప్రజలకు చేసిన మేలు నేటికీ మర్చిపోలేకుండా అన్ని ప్రభుత్వాలు వైయస్సార్ చేసిన పథకాలను అమలుపరుస్తూ ప్రజలకు ఉపయోగపడే విధంగా పథకాల నిర్మాణం జరిగిందని అన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, నియోజకవర్గ స్థాయి నాయకులు తదితరులు పాల్గొన్నారు. 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -