అసంపూర్తిగా ఉన్న నిర్మాణ పనులను పూర్తి చేయాలి: జడ్పీ సీఈవో అప్పారావు

నవతెలంగాణ – నూతనకల్
పాఠశాలల్లో అసంపూర్తిగా నిర్మాణంలో ఉన్న పనులను వెంటనే పూర్తి చేయాలని జెడ్పి సీఈవో అప్పారావు అన్నారు. శుక్రవారం మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల పనులు పర్యవేక్షించి మాట్లాడుతూ.. ప్రొఫెసర్ జయశంకర్ బడిబాట కార్యక్రమం లో భాగంగా రాష్ట్ర మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి నేడు ఉదయం 10 గంటలకు  విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు, నోట్ బుక్స్, ఉచిత యూనిఫామ్స్ అందిచనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో డి.ఆర్.డి.ఓ. మధుసూదన్ రాజు,జిల్లా విద్యాధికారి అశోక్,మండల రెవిన్యూ అధికారి శ్రీనివాసరావు, మండల అభివృద్ధి అధికారి సునీత, మండల విద్యాధికారి రాములునాయక్ తదితరులు పాల్గొన్నారు.
Spread the love