
నవతెలంగాణ – బెజ్జంకి
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సమగ్ర కుటుంబ సర్వేకు ప్రజలందరూ సహకరించాలని జెడ్పీ సీఈఓ రమేశ్ సూచించారు.బుధవారం మండల పరిధిలోని రేగులపల్లి గ్రామంలో గృహాల సంఖ్య వివరాలను తెలుసుకునేందుకు జెడ్పీ సీఈఓ రమేశ్ సందర్శించారు.ఈ సందర్భంగా జెడ్పీ సీఈఓ మాట్లాడుతూ 9న సమగ్ర కుటుంబ సర్వేలో కుటుంబ సభ్యుల వివరాలను ఎన్యూమరేటర్లు నమోదు చేస్తారని తెలిపారు.ఎంపీడీఓ ప్రవీన్,సూపరిండెంట్ అంజయ్య,ఎన్యూమరేటర్లు పాల్గొన్నారు.