Thursday, June 25, 2026
E-PAPER
Homeజాతీయంఆపరేషన్ చక్ర-4..80కి పైగా ప్రదేశాలలో సీబీఐ సోదాలు

ఆపరేషన్ చక్ర-4..80కి పైగా ప్రదేశాలలో సీబీఐ సోదాలు

- Advertisement -

నవతెలంగాణ-హైదారాబాద్: సైబర్ నేరగాళ్లు సాగించే ‘డిజిటల్ అరెస్ట్’ (Digital Arrest) మోసాలకు అడ్డుకట్ట వేసేందుకు సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (CBI) ఉక్కుపాదం మోపింది. ఆపరేషన్ చక్ర-4పేరుతో  గురువారం దేశంలోని 16 రాష్ట్రాలలో 80కి పైగా ప్రదేశాలలో ఏకకాలంలో తనిఖీలు నిర్వహించింది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, పంజాబ్‌, ఢిల్లీ మహారాష్ట్ర, హర్యానా, తమిళనాడు ఉత్తరప్రదేశ్‌, మధ్యప్రదేశ్‌, రాజస్థాన్, అస్సాం, పశ్చిమ బెంగాల్‌, మణిపూర్‌, కర్ణాటక, ఒడిశా తదితర ప్రాంతాల్లో ఈ దాడులు చేపట్టింది.

నకిలీ (షెల్) కంపెనీలను ఏర్పాటు చేసి, సైబర్ నేరాల సొమ్మును మళ్లించడానికి వీలుగా ‘మ్యూల్ బ్యాంక్ ఖాతాలను’ (మరోకరి పేరిట తెరిచే ఖాతాలు) నిర్వహిస్తున్న ఇద్దరు వ్యక్తులను చెన్నై, కోల్‌కతాలలో సీబీఐ అధికారులు అరెస్ట్ చేశారు. ఇప్పటివరకు 200 కంటే ఎక్కువ డిజిటల్ అరెస్ట్ స్కామ్ కేసులలో భాగస్వామ్యమై, దేశవ్యాప్తంగా విస్తరించిన ఒక పెద్ద నేరపూరిత నెట్‌వర్క్‌ను పూర్తిగా నిర్మూలించడమే ఈ ఆపరేషన్  ముఖ్య ఉద్దేశం.
 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -