సీపీఎస్ ఉద్యోగుల భారీ నిరస
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
సీపీఎస్‌ను రద్దు చేసి పాత పెన్షన్ విధానం (ఓపీఎస్)ను పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. ఉద్యోగుల ఆరోగ్య పథకం (ఈహెచ్ఎస్)ను వెంటనే అమలు చేయాలని కోరారు. శుక్రవారం హైదరాబాద్‌లోని భీమా భవన్ వద్ద మధ్యాహ్న భోజన విరామ సమయంలో సీపీఎస్ ఉద్యోగులు నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా టీఎస్సీపీఎస్ఈయూ రాష్ట్ర అధ్యక్షులు స్థితప్రజ్ఞ, ప్రధాన కార్యదర్శి కల్వల్ శ్రీకాంత్ మాట్లాడుతూ సీపీఎస్‌ను రద్దు చేసి, ఉద్యోగుల భవిష్యత్తుకు భరోసా ఇచ్చే పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాల న్నారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 2,316 మంది సీపీఎస్ ఉద్యోగులు ఉద్యోగ విరమణ పొందారనీ, వారికి కనీస సామాజిక భద్రత కరువైందని ఆవేదన వ్యక్తం చేశారు. ఉద్యోగ విరమణ పొందిన సీపీఎస్ ఉద్యోగులకు, వారి కుటుంబాలకు ప్రభుత్వం ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్ (ఈహెచ్ఎస్) ద్వారా నగదు రహిత వైద్య సౌకర్యాలను ఎలా వర్తింపజేస్తుందో తక్షణమే స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు. వృద్ధాప్యంలో ఆరోగ్య భద్రత కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. పెండింగ్‌లో ఉన్న సీపీఎస్ ఉద్యోగుల డీఏ బకాయిలను వెంటనే చెల్లించాలని కోరారు. ఉద్యోగ విరమణ చేసిన 2,316 మంది ఉద్యోగుల పరిస్థితి చూస్తుంటే సీపీఎస్ ఎంత ప్రమాద కరమో అర్థమవు తోందని అన్నారు. ఆరోగ్య భద్రత, పెన్షన్ సౌకర్యం లేకపోవడం అన్యాయ మన్నారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి ఈ సమస్యలను పరిష్కరిం చకపోతే ఆందో ళనలను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు.
ఓపీఎస్‌ను పునరుద్ధరించాలి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



