ఆర్‌యూబీ నిర్మాణ పనులు మొదలు పెట్టాలి

నవతెలంగాణ- నేరేడ్‌మెట్‌
నేరేడ్‌మెట్‌ వాజ్‌పేరు నగర్‌లో ఆర్‌యూబీ నిర్మాణ పనులు త్వరగా మొదలు పెట్టాలని కాంగ్రెస్‌ పార్టీ డిమాండ్‌ చేసింది. శనివారం మల్కాజిగిరి బి బ్లాక్‌ కాంగ్రెస్‌ పార్టీ కమిటీ, యూత్‌ కాంగ్రెస్‌ సంయుక్త ఆధ్వర్యంలో ధర్నా చేశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ… ఆర్‌యూబీ నిర్మాణ పనుల విష యంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిర్లక్ష్య ధోరణి అవలంబిస్తున్నాయని మండి పడ్డారు. కాంగ్రెస్‌ ప్రభుత్వంలో ఇక్కడ ఆర్‌యూబీ నిర్మాణ పనులకు శంకుస్థాపన జరిగినా నేటికీ కేంద్ర ,రాష్ట్ర ప్రభుత్వాల హయాంలో వీసమెత్తు పని జరగలేదని ఆరోపించారు. ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వం చొరవ చూపడం లేదన్నారు. సికింద్రాబాద్‌ మెట్టుగూడ వెళ్లేందుకు ఇది ప్రధాన దారి అని, ఒక్కసారి రైలు గేటు పడిందంటే కనీసం 30 నిమిషాల వరకు ట్రాఫిక్‌ జామ్‌ అవుతుందని తెలిపారు. ఎంఎంటీఎస్‌ పూర్తయితే 10 నిమిషాలకు ఒకసారి గేటు పడే అవకాశం ఉంటుందని, కావున ఆర్‌యూబీ తొందరగా పూర్తి చేయాలని కోరారు. రూ 23 కోట్ల బడ్జెట్‌లో 50 శాతం నిధులు కేంద్ర ప్రభుత్వం, 50 శాతం నిధులు రాష్ట్ర ప్రభుత్వంతో ఈ పనిని పూర్తి చేయాల్సి ఉండగా స్థానిక ఎంపీ రేవంత్‌ రెడ్డి చొరవతో కేంద్ర ప్రభుత్వం 50 శాతం నిధులు అమలు చేసిందని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం మిగతా 50 శాతం నిధులు కేటాయించకపోవడం వల్లనే ఈ పని జరగడం లేదని విమర్శించారు. మల్కాజిగిరి బి బ్లాక్‌ ప్రెసిడెంట్‌ జీడి శ్రీనివాస్‌ గౌడ్‌, మీడియా కన్వీనర్‌ గుత్తి రామచందర్‌, వి. శ్రీనివాస్‌ గౌడ్‌, యువత అధ్యక్షులు రెబ్బ వాసు, ఉపాధ్యక్షులు జే కే. సాయి ప్రసాద్‌, కే.రాము లు, ఎమ్మార్‌ శ్రీనివాస్‌, సానాది శంకర్‌, బుచ్చిబాబు, వేణు, నరసింహ గౌడ్‌, హనుమంత్‌, రవి ,సాయి, ఫరీద్‌, ప్రవీణ్‌, అవినాష్‌, సురేష్‌ యాదవ్‌, రుక్మత్‌, రజనీకాంత్‌, చరణ్‌ , ప్రమోద్‌ యాదవ్‌, బ్రహ్మ, జయ రాములు, వినో ద్‌ గౌడ్‌, బాలు, మహేందర్‌ తదితరులు పాల్గొన్నారు.

Spread the love