హైదరాబాద్ లో అంతర్జాతీయ సదస్సు గర్వకారణం

– రాష్ట్ర వైద్య, ఆరోగ్య-కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి హరీష్‌రావు
నవతెలంగాణ-బేగంపేట్‌
హైదరాబాద్‌లో అంతర్జాతీయ సదస్సు నిర్వహించడం తమకు గర్వ కారణమని రాష్ట్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి హరీష్‌రావు అన్నా రు. ”బ్రాంకస్‌ 2023” అనేది బ్రాంకస్‌ సిరీస్‌ 3వ ఎడిషన్‌. ఈ అంతర్జాతీయ ఇంటర్నేషనల్‌ పల్మోనాలజీ సదస్సు, లైవ్‌ వర్క్‌షాప్‌లో 40మంది కంటే ఎక్కువ అంతర్జాతీయ అధ్యాపకులు, 120మంది కంటే ఎక్కువ జాతీయ అ ధ్యాపకులు, 2వేలమంది పల్మోనాలజీ వై ద్యులతో ఇంటర్నేషనల్‌ పల్మోనాలజీపై వరల్డ్‌ అసోసియేషన్‌, యూరోపియన్‌ అసోసియేషన్‌, మలేషియన్‌ అసోసియేషన్‌ ఆమోదించిన ఆసియాలోనే అతిపెద్ద సదస్సు, లైవ్‌ వర్క్‌షాప్‌ను వరుసగా మూడోసారి యశోద గ్రూప్‌ అఫ్‌ హాస్పిటల్స్‌ నిర్వహిస్తోంది. ఈ సదస్సులో భాగంగా రెండోరోజు ముఖ్య అతిథిగా మంత్రి హరీష్‌రావు పాల్గొని మాట్లాడుతూ.. ఆధునికతను సంతరిం చుకుంటూ, తన పరిధిని విస్తరించుకుంటున్న ఊపిరితిత్తుల వైద్య విభాగం, వైద్య విజ్ఞాన శాస్త్రంలో చోటుచేసుకుంటున్న సరికొత్త ఆవిష్కరణలపై దష్టిసారించేందుకు వివిధ దేశాల వైద్య నిపుణుల మధ్య వైద్య విజ్ఞానాన్ని పంచుకోవడానికి వేదికగా నిలిచిందన్నారు. యశోద హాస్పిటల్స్‌ ”బ్రాంకస్‌ 2023” దేశంలోనే వరుసగా మూడోసారి అంతర్జాతీయ స్థా యిలో నిర్వహించిన అత్యాధునిక ప్రపంచ స్థాయి ‘అంతరా ్జతీయ ఇంటర్నేషనల్‌ పల్మోనాలజీ సదస్సు, లైవ్‌ వర్క్‌ షాప్‌’ ఇదే మొట్టమొదటిదని అన్నారు. నానాటికీ పుట్టుకొస్తున్న కొత్తకొత్త మహమ్మారులు/ ఊపిరితిత్తుల వ్యాధులు, సుదీర్ఘకాలంగా వేధించే ఉబ్బస వ్యాధి నుంచి ప్రస్తుత కరోన వైరస్‌ వరకు అనేక ఊపిరితిత్తుల వ్యాధులకు ఉపశమనం కలిగించే బ్రాంకియాల్‌ థర్మో ప్లాస్టీ, ఇంటర్వెన్షనల్‌ బ్రాంకోస్కోపిక్‌ థర్మల్‌ వెపౌర్‌ అబ్లేషన్‌ – (బీవీటీఏ) లాంటి అత్యాధునిక వైద్య విధానాలను దక్షిణాదిలో తొలిసారిగా ప్రవేశపెట్టిన ఘనత యశోద హాస్పిటల్స్‌ వైద్యులకు దక్కిందని యశోద గ్రూప్‌ హాస్పిటల్స్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ డాక్టర్‌.జిఎస్‌.రావు వెల్లడించారు. బ్రాంకియాల్‌ థర్మో ప్లాస్టీ విధానం ద్వారా దేశంలోనే ఎక్కువ మంది రోగులకు చికిత్స చేసిన ఘనత కూడా యశోద హాస్పిటల్స్‌దేనని ప్రకటించారు. ఈ కార్యక్రమంలో యశోద హాస్పిటల్స్‌ డైరెక్టర్‌ డా. పవన్‌ గోరుకంటి, వైద్య నిపుణులు డాక్టర్‌. హరికిషన్‌, ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ప్రముఖ వైద్యులు ప్రొఫెసర్‌ ఫెలిక్స్‌ హెర్త్‌ -థొరాక్స్‌ క్లినిక్‌ (జర్మనీ), ప్రొఫెసర్‌ కైల్‌ హౌగార్త్‌ – యూనివర్శిటీ ఆఫ్‌ చికాగో (యుఎస్‌ఎ), డాక్టర్‌. మైఖేల్‌ ప్రిట్చెట్‌ (యుఎస్‌ఎ), డాక్టర్‌.పల్లవ్‌ షా (లండన్‌), డాక్టర్‌.మునవ్వర్‌ (లండన్‌), డాక్టర్‌.లోరెంజో (ఇటలీ), డాక్టర్‌.జమాలుల్‌ (మలేషియా) పాల్గొన్నారు.

Spread the love