ఆహ్లాదకరమైన వాతావరణంలో విద్యాబోధన

– అన్ని రకాల మౌలిక సౌకర్యాలతో
– ప్రభుత్వ బడుల అభివృద్ధి
– మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌
– మన బస్తీ, మన బడి కింద అభివృద్ధి చేసిన పాఠశాలల ప్రారంభం
నవతెలంగాణ-బేగంపేట్‌, బంజరాహిల్స్‌, సిటీబ్యూరో

ఆహ్లాదకరమైన వాతావరణంలో విద్యాబోధన జరిగే విధంగా ప్రభుత్వ పాఠశాలలను అన్ని రకాల సౌకర్యాలు, వసతులతో అభివృద్ధి చేయడమే మన బస్తీ-మన బడి కార్యక్రమం ముఖ్య ఉద్దేశమని రాష్ట్ర పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ తెలిపారు. బుధవారం సనత్‌నగర్‌ నియోజకవర్గం పద్మారావునగర్‌ లోని మైలార్‌ గూడ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో రూ. 18.92 లక్షల రూపాయల వ్యయంతో, కంటోన్మెం ట్‌ నియోజకవర్గంలోని పికెట్‌ లక్ష్మినగర్‌ ప్రాథమిక పాఠశాలలో 36.28 లక్షల వ్యయంతో, ఖైరతాబాద్‌ నియోజకవర్గ పరిధిలోని రాజ్‌ భవన్‌ ప్రాథమిక పాఠశాలలో రూ. 17.38 లక్షల వ్యయంతో వివిధ అభివృద్ధి పనులు పూర్తి చేయగా, బుధవారం మంత్రి శ్రీనివాస్‌ యాదవ్‌ ఆయా నియోజకవర్గ ఎమ్మెల్యేలు సాయన్న, దానం నాగేందర్‌, బెవరేజేస్‌ కార్పొరేషన్‌ చైర్మెన్‌ గజ్జెల నగేష్‌, టీఎస్‌ఎంఐడీసీ చైర్మెన్‌ ఏర్రోళ్ల శ్రీనివాస్‌, డిప్యూటీ మేయర్‌ మోతే శ్రీలత రెడ్డి, హైదరాబాద్‌ డీఈవో ఆర్‌.రోహిణిలతో కలిసి ప్రారం భించారు. ఈ సందర్భంగా పాఠశాలలోని అన్ని తరగతి గదులు, టాయిలెట్స్‌ను మంత్రి తిరిగి పరిశీలించారు. నూతన ఫర్నిచర్‌, పాఠశాల భవనానికి కలర్స్‌ వేసిన తర్వాత ఎలా ఉంది అని విద్యార్ధులను అడగ్గా, చాలా బాగుంది అని విద్యార్ధులు చెప్పారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో సరైన సౌకర్యాలు, వసతులు లేని కారణంగానే అనేకమంది విద్యార్ధులను వారి తల్లిదండ్రులు వేలాది రూపాయల ఫీజులు చెల్లించి ప్రయివేటు పాఠశాలలకు పంపిస్తున్నారని తెలిపారు. ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలను మార్చాలి… విద్యార్ధులకు అన్ని రకాల సౌకర్యాలు కల్పించాలనే ముఖ్యమంత్రి ఆలోచన మేరకు మన బస్తీ-మన బడి కార్యక్రమాన్ని చేపట్టినట్టు వివరించారు. ఈ కార్యక్రమం కింద రాష్ట్రంలో 26,065 పాఠశాలలు ఉండగా, మొదటి విడతలో 9,123 పాఠశాలలను ఎంపిక చేసినట్టు తెలి పారు. ఇందుకుగాను రూ.7,289 కోట్లు ప్రభుత్వం మంజూరు చేసిందని చెప్పారు. హైదరాబాద్‌ జిల్లాలో 239 పాఠశాలలను ఎం పిక చేసి రూ. 44 కోట్లు మంజూరు చేసినట్లు పేర్కొన్నారు. ఈ నిధులతో ప్రహారీగోడ నిర్మాణం, టాయిలెట్స్‌ నిర్మాణం, అభివృద్ధి పనులు, విద్యుత్‌, తాగునీటి సౌకర్యం, ఫర్నిచర్‌ కొనుగోలు తదితర 12రకాల అభివృద్ధి పనులను చేపట్టినట్టు చెప్పారు. రాష్ట్రంలోని అన్ని పాఠశాలలను పూర్తిస్థాయిలో అభివృద్ధి చేయనున్నట్టు తెలిపారు. గతంలో ఏ ప్రభుత్వమూ ఇంత పెద్ద మొత్తంలో నిధులు కేటాయించలేదని ఆయన గుర్తుచేశారు. మన బస్తీ-మన బడి కార్య క్రమంతో ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలు మారిపోయాయని తెలిపారు. కార్పొరేట్‌ పాఠశాలను తలపించే విధంగా విద్యార్ధులకు ఎంతో నాణ్యమైన టేబుల్స్‌, బెంచీలు, ఇతర ఫర్నిచర్‌ను అందు బాటులోకి తీసుకొచ్చినట్టు చెప్పారు.ఉచితంగా విద్యాబోధనతో పాటు నాణ్యమైన భోజనాన్ని అందిస్తున్నట్టు వివరించారు. అన్ని వసతులు, సౌకర్యాలతో కూడిన ప్రభుత్వ పాఠశాలల్లోనే విద్యా ర్ధులను చేర్పించాలని పిలుపునిచ్చారు. పాఠశాలల ప్రధానోపాధ్యా యులు, ఉపాధ్యాయులు పాఠశాలను ఎంతో సక్రమంగా నిర్వహించుకోవాలన్నారు. కార్పొరేటర్‌లు హేమ లత, విజయారెడ్డి, నళిని యాదవ్‌, గ్రంధాలయ సంస్థ చైర్మెన్‌ ప్రసన్న, అదనపు కలెక్టర్‌ వెంకటేశ్వర్లు, ప్రాజెక్టు ఇంజనీరింగ్‌ అధికారి షఫీ, డిప్యూటీ ఈవోలు చిరంజీవి, సామ్యూల్‌ రాజ్‌, బాలు నాయక్‌, డిప్యూటీ ఇన్‌స్పెక్టర్‌ ఆఫ్‌ స్కూల్స్‌ విజరు కుమార్‌, సెక్టో రియల్‌ ఆఫీసర్‌ రజిత, ప్రధానోపాధ్యా యులు ఉమాదేవి,రత్న మాల, మంజులత, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు.

Spread the love