ఓయూ పీహెచ్డీ ప్రవేశ పరీక్షలో ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థులకు న్యాయం చేయాలి

నవతెలంగాణ-ఓయూ
ఓయూ పీహెచ్డీ ప్రవేశ పరీక్ష 2022లో ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్థులకు తీవ్ర అన్యాయం జరిగిందని రూల్‌ ఆఫ్‌ రిజర్వేషన్‌ పాటిస్తూ విభాగాల వారీగా ఆయా సీట్లను ఆయా కేటగిరి విద్యార్థులకు కేటాయించాలనీ, ఓసీలకు 25శాతం, బీసీలకు 20 శాతం, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఎలాంటి కనీస అర్హత మార్కులు లేకుండా ఇంటర్వ్యూకు పిలవాలనీ, ప్రవేశ పరీక్షలో ర్యాంకింగ్‌ విధానాన్ని తీసివేయాలనీ, తర్వాతనే పీహెచ్డీ అడ్మిషన్‌కు సెలెక్ట్‌ అయిన అభ్యర్థుల జాబితాను ప్రకటించాలనీ, విభాగాల లో ఖాళీల సంఖ్య పెంచాలనీ, ప్రవేశ పరీక్ష కేవలం అర్హత పరీక్ష గానే గుర్తించి ర్యాంకుల విదానాన్ని రద్దు చేయాలని ఓయూ ఎస్సీ, ఎస్టీ ప్రోప్రెసర్స్‌ అభిప్రా యాలను వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఓయూ ఎస్సీ, ఎస్టీ సెల్‌ డైరెక్టర్‌ ప్రొ.మంగు నాయక్‌, ఓయూ యూజీసీ డీన్‌ ప్రొ.మల్లేశం, బీసీ సెల్‌ డైరెక్టర్‌ ప్రొ. వెంకటేశ్వర్లు, లా కళాశాల డీన్‌ ప్రొ.గాలి వినోద్‌ కుమార్‌, తెలుగుశాఖ విభాగాధిపతి ప్రొ.కాసిం, పొలిటికల్‌ సైన్స్‌ విభాగాధిపతి ప్రొ.చంద్రు నాయక్‌, ప్రొ.కొండా నాగేశ్వర్‌ పాల్గొన్నారు.

Spread the love