– మెడిటెక్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్’ను ప్రారంభించిన ఎమ్మెల్యే కేపి వివేకానంద్
నవతెలంగాణ-జగద్గిరిగుట్ట
పేద మధ్యతరగతి ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించినప్పుడే ఆస్పత్రులు మనుగడ సాధిస్తాయని కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ అన్నారు మంగళవారం జగద్గిరిగుట్ట డివిజన్ పరిధి బీరప్ప నగర్ ప్రధాన రహదారి ప్రాంగణంలో నూతనంగా ఏర్పాటు చేసిన ”మెడిటెక్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్”న ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభించారు. ముందుగా జ్యోతి ప్రజ్వలన చేసి, ఆస్పత్రి యాజమాన్యానికి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ ప్రాంతంలో కార్పొరేట్ స్థాయి ఆసుపత్రి ఏర్పాటు చేయడం శుభసూచకమని తెలిపారు. ఎటువంటి లాభాపేక్ష లేకుండా మెరుగైన వైద్య సేవలు అందించాలని ఆస్పత్రి నిర్వాహకులకు సూచించారు . తన వంతు సహకారాలు అందజేస్తారని తెలిపారు .మెడిటెక్ మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రి ఎండి. డాక్టర్ గోపికష్ణ మాట్లాడుతూ జగద్గిరిగుట్ట ప్రాంతంలో సాధారణ ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని లక్ష్యంతో ఈ ప్రాంతంలో సుమారు 40 పడకల ఆసుపత్రి ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. అత్యవసర చికిత్స కోసం దూరప్రాంతాలకు వెళుతున్నారని తెలుసుకొని సేవా దక్పథంతో ఈ ఆస్పత్రి ఏర్పాటు చేశామని స్పష్టం చేశారు. కడుపేదలకు ఉచితంగా వైద్య సేవలు అందిస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆలేరు మాజీ శాసనసభ్యులు కుడుదుల నగేష్, కార్పొరేటర్లు కొలుకుల జగన్ ,రావుల శేషగిరి, జూపల్లి సత్యనారాయణ ,మంత్రి సత్యనారాయణ మాజీ కార్పొరేటర్లు గుడిమెట్ల సురేష్ రెడ్డి, మాధవరం రంగారావు, ఆసుపత్రి నిర్వాహకులు డాక్టర్. యోగేష్, డాక్టర్ ఎన్ .అర్చన, తోపాటు ఆసుపత్రి సలహాదారులు నవ్వ ప్రభాకర్ రావు, మున్నూరు కాపు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి సాయి శ్రీనివాస్, ఆవుచెర్ల లక్ష్మీనారాయణ. స్థానిక నాయకులు గుజ్జుల పాపిరెడ్డి సయ్యద్ రషీద్, వేణు యాదవ్,.ప్రజా ప్రతినిధులు, డివిజన్ బీఆర్‌ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.