ప్రజాప్రయోజనాలకు విరుద్ధమైన బడ్జెట్..

నవతెలంగాణ-బెజ్జంకి
పేద, మద్యతరగతి, కార్మికుల ప్రయోజనాలకు విరద్ధంగా రుపోందించి ప్రవేశపెట్టిన బడ్జెట్ కేంద్ర ప్రభుత్వ బడ్జెటని సీపీఐ(ఎం)మండల కార్యదర్శి తిప్పారపు శ్రీనివాస్ ఆరోపించారు. గురువారం మండల కేంద్రంలో సీపీఐ(ఎం) గ్రామశాఖ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ దేశంలోని ప్రజలను నిరాశ బడ్జెట్ అన్నారు.కుబేరుల అధేశాల మేరకు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతరామన్ బడ్జెట్ రుపోందించినట్టుందని అసహనం వ్యక్తం చేశారు. వ్యవసాయ చట్టాలను ఉపసంహరించుకోవాలని డిల్లీలో పోరాటం చేసిన చారిత్రాత్మక ఐక్య రైతు ఉద్యమంపై ప్రతీకారం తీర్చుకునేలా గ్రామీణ ఉపాధి హామీ, ఎంజీఎన్ఆర్ఈజీఏ, ఆహార భద్రత, ఎరువుల సబ్సిడీ వంటి వాటిపై భారీగా కోత విదించిదన్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ వల్ల సామాన్య ప్రజలు, కార్మికులకు నిరాశే మిగిలిందని ఒరిగిందేమిలేదని హితవు పలికారు. మండల కమిటీ సభ్యులు కుంట సత్తయ్య,సాయికృష్ణ, కుంట శ్రీనివాస్, గాజరాజు, చంద్రయ్య, నర్సింగం, నాగరాజు తదితరులు పాల్గొన్నారు.

Spread the love