రెండో రోజూ కొనసాగిన ఇంటింటి సర్వే

నవతెలంగాణ-జూబ్లీహిల్స్‌
జూబ్లీహిల్స్‌ నియోజకవర్గం, రహమత్‌ నగర్‌ డివిజన్‌ ఎస్‌పీఆర్‌ హిల్స్‌, హౌమ్‌ నగర్‌లో సీఐటీయూ, డీివైఎఫ్‌ ఐ, ఐద్వా శ్రామిక మహిళా సమన్వయ కమిటీ ప్రజా సంఘాల ఆధ్వర్యంలో రెండో రోజు డబుల్‌ బెడ్‌రూం ఇండ్ల కోసం ఇంటింటి సర్వే కొనసాగింది. ఈ సర్వేలో ప్రజా సంఘాల బృందం దృష్టికి వందలాది మంది ప్రజలు డబుల్‌ బెడ్‌ రూమ్స్‌ కోసం దరఖాస్తులు చేసుకున్నామని తెలిపారు. 15, 20 ఏండ్ల నుంచి అద్దె ఇంట్లో జీవనం కొన సాగిస్తున్నామనీ, కుటుంబం మొత్తం కూలి పనులు చేసు కుని సంపాదించిన ఆదాయం ఇంటి అద్దె, పిల్లల చదువు, వైద్యం ఖర్చులకు కూడా సరిపోవట్లేదని బృందం దృష్టికి తీసుకొచ్చారు. సీఐటీయూ హైదరాబాద్‌ నగర ఉపాధ్యక్షు లు జె.స్వామి ఈ సర్వేలో వచ్చిన సమస్యల మీద మాట్లాడు తూ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీల్లో ఇల్లు లేని ప్రతి పేద కుటుంబానికీ డబుల్‌ బెడ్‌ రూమ్స్‌ కట్టిస్తానని హామీ ఇచ్చిందనీ, 120 గజాల స్థలంలోపు ఉన్నవారికి ఇల్లు నిర్మాణం కోసం రూ.3లక్షలు ప్రభుత్వం ఇస్తుందని ఇచ్చిన హామీలను ఈ 9 ఏండ్లలో జూబ్లీహిల్స్‌ నియోజకవర్గంలో ఎక్కడా అమలు కాలేదన్నారు. నియోజ కవర్గంలో ఇల్లు లేని ప్రతి కుటుంబాన్ని గుర్తించి, అర్హులైన పేదలందరికీ డబుల్‌ బెడ్‌ రూమ్‌ ఇవ్వాలని కోరారు. ఈ సమస్యల పరిష్కారం కోసం ఈ నెల 9వ తేదీన చలో హైదరాబాద్‌ మహా ధర్నా చేపట్టనున్నట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రజా సంఘాల నాయకులు టి.సాయి శేష గిరిరావు, ఆర్‌.అశోక్‌, ఏఆర్‌.నరసింహ, బి.లక్ష్మణ్‌, తది తరులు పాల్గొన్నారు.
డిమాండ్స్‌ ఇలా..
1.అర్హులైన పేదలందరికీ ‘డబుల్‌’ ఇండ్లు కట్టివ్వాలి
2.ఇంటి స్థలం ఉన్న పేదలందరికీ ఇంటి నిర్మాణం కోసం రూ.5లక్షలు ఇవ్వాలి
3.అసంపూర్తిగా ఉన్న డబుల్‌ బెడ్‌ రూం ఇండ్లను వెంటనే పూర్తి చేయాలి.

Spread the love