విద్యా రంగాన్ని విస్మరించిన కేంద్ర బడ్జెట్‌

నవతెలంగాణ-హిమాయత్‌నగర్‌
కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్‌ లో పూర్తిగా విద్యా రంగాన్ని విస్మరించిందని ఏఐఎస్‌ఎఫ్‌ రాష్ట్ర కార్యదర్శి పుట్ట లక్ష్మణ్‌ బుధవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈ బడ్జెట్‌ కేవలం పార్లమెంట్‌ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ప్రవేశపట్టిన ఎన్నికల బడ్జెట్‌ తప్ప విద్యార్థులు, యువకులకు ఈ బడ్జెట్‌ ద్వారా ఏమీ ప్రయో జనం లేదన్నారు. బడ్జెట్‌ లో విద్యకు 10 శాతం నిధులు కేటాయించాలని కొఠారి కమిషన్‌ చెప్పినా మోడీ ప్రభుత్వం విద్యా రంగం పట్ల చిన్న చూపు చూస్తూ కనీసం 5 శాతం నిధులు కేటాయించలేదన్నారు. 2023-24 ఆర్థిక సంవత్సరానికి కేంద్ర బడ్జెట్‌లో విద్యా రంగానికి కేంద్ర ప్రభుత్వం రూ.1,12,899 కోట్లు కేటాయించిందనీ, ఈ మొత్తంలో పాఠశాల విద్య, అక్షరాస్యత శాఖకు రూ.68,804.85 కోట్లు, ఉన్నత విద్యా శాఖకు రూ.44,094.62 కోట్లు కేటాయించారని తెలిపారు. కేంద్రంలో మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి బడ్జెట్‌ లో విద్యకు నిధులు తగ్గిస్ణూస్త కార్పొరేట్‌ కంపెనీలకు దోచి పెడుతుందన్నారు. డిజిటల్‌ విద్య, లైబ్రరీ ప్రాధాన్యత అంటున్న మోడీ ప్రభుత్వం పేద వారికి విద్యను దూరం చేసి విద్యను మొత్తం ప్రైవేటీకరణ చేసే కుట్ర చేస్తుందనీ, ఈ బడ్జెట్‌ లో విద్యార్థు లకు సంబంధించిన స్టేషనరీ వస్తువులపై జీఎస్టీ ఎత్తివేయడం, కనీసం తగ్గిం చడం లేదనీ, ముఖ్యంగా తెలంగాణ విభజన హామీల్లో ఉన్న ట్రిపుల్‌ ఐటీ, జిల్లాకో నవోదయ పాఠశాలల ఏర్పాటు, కేంద్రీయ విద్యాలయల ఏర్పాటు, గిరిజన యూనివర్సిటీ ఏర్పాటు ఈ బడ్జెట్‌ లోనైనా వస్తాయనుకుంటే మొండి చేయి చూపించిందన్నారు. యూనివర్సిటీలను నిర్వీర్యం చేస్తూ ప్రైవేట్‌, విదేశీ యూనివర్సిటీలకు ప్రాధాన్యం ఇచ్చేలా కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తుందన్నారు. ఈ బడ్జెట్‌ పూర్తిగా విద్యార్థి వ్యతిరేక బడ్జెట్‌ అనీ, తెలంగాణ రాష్ట్ర విద్యార్థుల పట్ల తెలంగాణ విభజన హామీల్లో ఉన్న విద్యా సంస్థలను తెలంగాణకు కేటా యించకుండా మోడీ ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరించిందన్నారు. విద్యా ర్థి వ్యతిరేక విధానాలపై ఏఐఎస్‌ఎఫ్‌ అధ్వర్యంలో ఉద్యమిస్తామన్నారు.

Spread the love