వ్యవసాయ పర్యటనలో శ్రీ చైతన్య వినాయక నగర్ బ్రాంచ్ విద్యార్థులు

నవతెలంగాణ-కంటేశ్వర్
నిజామాబాద్ శ్రీ చైతన్య వినాయక్ నగర్ బ్రాంచ్ విద్యార్థులు స్మార్ట్ లివింగ్ ప్రోగ్రాంలో భాగంగా నిజామాబాద్ జిల్లా కేంద్రంలో వ్యవసాయ క్షేత్రంలో పర్యటించి వరినాట్లు వేసె విధానం, పంటలు పండించే విధానం స్వయంగా తెలుసుకున్నారు. సేంద్రీయ వ్యవసాయ పద్ధతులను రైతులను విద్యార్థులు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రిన్సిపాల్ ఎలీషా మాట్లాడుతూ.. విద్యార్థులు వ్యవసాయం గురించి , రైతులు పండించే పంటల విధానం గురించి తెలుసుకున్నారు అని తెలిపారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఎ.ఓ మేదరి శేఖర్, డిన్ సందిప్ ఇతర ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమం సందర్భంగా శ్రీ చైతన్య పాఠశాల చైర్మన్ మల్లెంపాటి శ్రీధర్ రావు, డైరెక్టర్ శ్రీ విద్య, డిజియం లక్ష్మన్ రావు, నిజామాబాద్ ఆర్ఐ కే రాజు ను, విద్యార్థులను, ఉపాధ్యాయులను అభినందించారు.

Spread the love