శ్రీచైతన్య నాలెడ్జ్‌ హబ్‌ కోచింగ్‌ సెంటర్లు ప్రారంభం

– 8 నుంచి 12వ తరగతి వరకు ఐఐటీ-జేఈఈ, నీట్‌ శిక్షణ
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
ఐఐటీ-జేఈఈ, నీట్‌ శిక్షణ లో విప్లవాత్మకంగా పాఠశాల సమయం అనంతరం విద్యార్థుల కోసం శ్రీ చైతన్య నాలెడ్జ్‌ హబ్‌ కోచింగ్‌ సెంటర్లను ప్రారంభిం చింది. శనివారం హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో శ్రీచైతన్య విద్యా సంస్థల అకడమిక్‌ డైరెక్టర్‌, ఇన్ఫినిటీ లెర్న్‌ కో ఫౌండర్‌ సుష్మ బొప్పన మాట్లాడుతూ ఎనిమిదో తరగతి నుంచి 12వ తరగతి విద్యార్థుల వరకు ఐఐటీ-జేఈఈ, నీట్‌ శిక్షణ ఇస్తామని చెప్పారు. శ్రీచైతన్యతోపాటు ఇతర పాఠశాలల్లో చదివే విద్యార్థులకూ ఐఐటీ, నీట్‌లో చేరాలనే కల సాకారం చేసుకోవడానికి ఇది అద్భుత అవకాశమని అన్నారు. మొదటి విడతలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌, తమిళనాడు, కర్నాటక, మహారాష్ట్రలో 11 బ్రాంచీల్లో ప్రారంభిస్తున్నామని వివరించారు. హైదరా బాద్‌లో దిల్‌సుఖ్‌నగర్‌, హిమాయత్‌నగర్‌, తిరుమలగిరి, అమీర్‌పేట, కూకట్‌పల్లి, కొండాపూర్‌లో అందుబాటులో ఉన్నాయని చెప్పారు. రాబోయే రెండు, మూడేండ్లలో దేశవ్యాప్తంగా 200 సెంటర్లకు విస్తరిస్తామని అన్నారు. పాఠశాలల్లో చెప్పే పాఠాలను ఇక్కడ వివరణాత్మకంగా విద్యార్థుల కు అర్థమయ్యేలా బోధిస్తామని వివరించారు. ఆన్‌లైన్‌లో వారాంతపు పరీక్షలను నిర్వహిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో నాలెడ్జ్‌ హబ్‌ సీఈవో శేషగిరిరాజు తదితరులు పాల్గొన్నారు.

Spread the love