‘సూపర్‌ మాక్స్‌’ కార్మికుల సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకోవాలి

– ఎమ్మెల్యే కేపీ వివేకానంద్‌
– కార్మికుల సమస్యలపై అసెంబ్లీలో ఎమ్మెల్యే ప్రస్తావన
నవతెలంగాణ – కుత్బుల్లాపూర్‌/జగద్గిరిగుట్ట
కుత్బుల్లాపూర్‌ నియోజకవర్గ పరిధికి చెందిన కార్మిక సమస్యలపై శుక్రవారం తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా ఎమ్మెల్యే కేపీ వివేకానంద్‌ ప్రస్తావించారు. జీడిమెట్ల పారిశ్రమికవాడలో ఉన్న సూపర్‌ మాక్స్‌ కంపెనీలో పనిచేస్తున్న కార్మికుల పరిస్థితి దీనంగా ఉందని, ఐదు నెలలుగా కంపెనీ నడవక అందులో పనిచేస్తున్న కార్మికులకు జీతాలు లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, యజమాన్యం మధ్య నెలకొన్న గొడవల మూలన ఐదు నెలలుగా కంపెనీ నడవక, కార్మికులకు జీతాలు లేవని, సమస్య ఇప్పటికే ప్రభుత్వ దష్టికి వచ్చిందని, ఈ సమస్య పరిష్కారం కోసం లేబర్‌ కమిషన్‌ మరియు ఇండిస్టీస్‌ ప్రిన్సిపల్‌ సెక్రటరీలు సమావేశం అయ్యేలా రాష్ట్ర కార్మిక శాఖ చర్యలు తీసుకోవాలని అన్నారు. హెచ్‌ఎంటి విశ్రాంత ఉద్యోగులకు సుమారు 300 కోట్ల బకాయిలు పెండింగ్‌ ఉన్నాయని, ఐదేళ్లు గడుస్తున్నా సమస్య పరిష్కారం కావడం లేదని, శేష జీవితం సంతోషంగా గడపవలసిన రిటైర్డ్‌ ఉద్యోగులు ఆర్థికంగా అనేక ఇబ్బందులు పడుతున్నారని, ఆందోళన చెంది కొందరు మరణిస్తున్నారని తీవ్రమైన ఈ సమస్య పరిష్కారానికి రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి ప్రత్యేక దష్టి వహించి కేంద్ర కార్మిక శాఖ మంత్రితో చర్చించి వేగంగా సమస్య పరిష్కారం అయ్యేలా, వారికి రావలసిన బకాయిలు చెల్లించేలా చర్యలు తీసుకోవాలని కోరారు. అదేవిధంగా కుత్బుల్లాపూర్‌ నియోజకవర్గంకు మంజూరైన ఐటిఐ కళాశాల త్వరలోనే ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలని కోరారు. ఎమ్మెల్యే లేవనెత్తిన అంశాలకు కార్మిక శాఖ మంత్రి సమాధానమిస్తూ… కార్మికుల సమస్యల పరిష్కారానికి తప్పక చర్యలు తీసుకుంటామని అన్నారు.

Spread the love