హ్యాట్రిక్‌ హిట్‌ కోసం రామబాణం

గోపీచంద్‌, డైరెక్టర్‌ శ్రీవాస్‌ది టాలీవుడ్‌లో సక్సెస్‌ఫుల్‌ కాంబినేషన్‌. ‘లక్ష్యం, లౌక్యం’ వంటి సూపర్‌ హిట్లను అందించారు. ఇప్పుడు మూడోసారి హ్యాట్రిక్‌ హిట్‌ కొట్టేందుకు ఈ ఇద్దరూ కలిసి చేస్తున్న చిత్రాన్ని పీపుల్‌ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌లో టి.జి.విశ్వ ప్రసాద్‌, వివేక్‌ కూచిభొట్ల సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇందులో గోపీచంద్‌ సరసన నాయికగా డింపుల్‌ హయతి నటిస్తుండగా, జగపతి బాబు అన్నయ్యగా, కుష్బూ వదినగా ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. గోపీచంద్‌ కెరీర్‌లో 30వ సినిమాగా రాబోతున్న ఈ చిత్ర షూటింగ్‌ కార్యక్రమాలు ప్రస్తుతం ముగింపు దశలో ఉన్నాయి.
సంక్రాంతి శుభవేళ ఈ చిత్రం పేరును ‘రామబాణం’గా ప్రకటిస్తూ చిత్ర బృందం విడుదల చేసిన ప్రచార చిత్రం అందర్నీ ఆకట్టుకుంటోంది. ‘అన్‌ స్టాపబుల్‌’ కార్యక్రమంలో ప్రభాస్‌, గోపీచంద్‌ పాల్గొన్న సందర్భంలో ఈ చిత్రం పేరును ‘రామబాణం’గా బాలకృష్ణ ప్రకటించడం తమకెంతో ఆనందాన్ని కలిగించిందని చిత్ర దర్శకుడు శ్రీవాస్‌, నిర్మాతలు టి.జి. విశ్వ ప్రసాద్‌, వివేక్‌ కూచిభొట్ల పేర్కొన్నారు.
ఫ్యామిలీ ఎమోషన్స్‌తో పాటు సామాజిక సందేశం కూడా మిళితమైన బలమైన కథాంశం ఉన్న చిత్రమిది. ఈ చిత్రంలో సరికొత్త గోపీచంద్‌ను చూడబోతున్నారు.’లక్ష్యం, లౌక్యం’ ఈ రెండు సినిమాలను మించేలా ఉండాలని ఈ సినిమాని శ్రీవాస్‌ ఓ బాధ్యతతో తీర్చి దిద్దుతున్నాడు. వ్యయానికి వెనకాడకుండా చాలా గ్రాండ్‌గా, సమున్నత సాంకేతిక విలువలతో భారీ బడ్జెట్‌తో నిర్మాణం చేస్తూ ఈ చిత్రం విజయంపై నిర్మాతలు నమ్మకంతో ఉన్నారు. ఈ ఏడాది వేసవి కానుకగా చిత్రం విడుదల అయ్యే దిశగా చిత్ర నిర్మాణ కార్యక్రమాలు జరుగుతున్నాయి. సచిన్‌ ఖేడ్‌ ఖర్‌, నాజర్‌, ఆలీ, రాజా రవీంద్ర, వెన్నెల కిషోర్‌, సప్తగిరి,కాశీ విశ్వనాథ్‌, సత్య,గెటప్‌ శ్రీను, సమీర్‌, తరుణ్‌ అరోరా తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి  సంగీతం : మిక్కీ జే మేయర్‌, డీఓపీ : వెట్రి పళని స్వామి, స్టోరీ : భూపతి రాజా, డైలాగ్స్‌ : మధుసూధన్‌ పడమటి, ఆర్ట్‌ డైరెక్టర్‌ : కిరణ్‌ కుమార్‌ మన్నె

Spread the love