విమానాశ్రయంలో 1.329 కిలోల బంగారం పట్టివేత

– బంగారం విలువ రూ.81.6 లక్షలు
నవతెలంగాణ-శంషాబాద్‌
అక్రమంగా తరలిస్తున్న బంగారాన్ని శంషాబాద్‌ ఆర్‌జీఐ ఎయిర్‌పోర్టులో ఆదివారం హైదరాబాద్‌ కస్టమ్స్‌ అధికారులు పట్టుకున్నారు. కస్టమ్స్‌ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం..
ఓ ప్రయాణికుడు చెన్నరు నుంచి హైదరాబాద్‌కు వస్తున్నాడు. అయితే, విమానం అంతకు ముందు అబుదాబి నుంచి చెన్నరుకి ప్రయాణించింది. ఆ సమయంలో వెనుక టాయిలెట్‌లోని వాష్‌ బేసిన్‌ కింద ప్రయాణికుడు బంగారం పేస్ట్‌ దాచాడు. కస్టమ్స్‌ సుంకం చెల్లింపును ఎగవేసి ఎయిర్‌పోర్ట్‌ నుంచి రహస్యంగా బంగారం పేస్ట్‌ను రవాణా చేయడానికి ప్రయత్నించాడు. విశ్వసనీయ సమాచారం మేరకు అధికారులు అతన్ని తనిఖీ చేశారు. ప్యాంట్‌ పాకెట్లలో దాచిన 1329 గ్రాముల బంగారం పేస్ట్‌ను స్వాధీనం చేసుకున్నారు.దీని విలువ రూ. 81.6 లక్షలు ఉంటుంది. ప్రయాణికుడిని కస్టమ్స్‌ చట్టం 1962 కింద అరెస్టు చేశారు. కేసు దర్యాప్తు చేస్తున్నారు.

Spread the love