Sunday, June 14, 2026
E-PAPER
Homeఅంతర్జాతీయం2025లో 18 లక్షల మందికి పేదరిక విముక్తి

2025లో 18 లక్షల మందికి పేదరిక విముక్తి

- Advertisement -

బొగొటా : గతేడాది (2025)లో సుమారు 18 లక్షల మందిని పేదరికం నుంచి కొలంబియా విముక్తి చేసింది. 2024లో అక్కడ పేదరికపు రేటు 31.8 శాతంగా ఉంది. 2025లో ఇది 28 శాతానికి తగ్గింది. ఇక గతేడాది అక్కడ తీవ్ర పేదరికం 2.1 శాతం పాయింట్లు తగ్గి 9.6 శాతానికి చేరింది. 21వ శతాబ్దంలోనే ఇది రికార్డుస్థాయిలో అత్యంత కనిష్టస్థాయికి చేరుకుందని నేషనల్ డిపార్ట్‌మెంట్ ఆఫ్ స్టాటిస్టిక్స్ (డిఎఎన్‌ఇ) శుక్రవారం విడుదల చేసిన గణాంకాలు పేర్కొన్నాయి. 2024లో 16.24 లక్షల మంది పేదరికంలో ఉన్నారు. అదే 2025లో వీరి సంఖ్య 14.45 లక్షల మందికి తగ్గింది. అంటే సుమారు 1.79 లక్షల మంది పేదరికం నుంచి బయటపడ్డారు. ఇక తీవ్ర పేదరికంలో ఉన్న వారి సంఖ్య 2024లో 5.97 లక్షలుగా ఉన్నారు. 2025లో వీరి సంఖ్య 4.97 లక్షలకి చేరింది. సుమారు పది లక్షల మంది కేవలం ఒక్క సంవత్సరంలోనే తీవ్ర పేదరికం నుంచి బయటపడ్డారు. కుటుంబాల మధ్య ఆదాయ వ్యత్యాసాలు తగ్గడమే దీనికి కారణమని నేషనల్ డిపార్ట్‌మెంట్ ఆఫ్ స్టాటిస్టిక్స్ వెల్లడించాయి. అయితే ప్రాంతీయ అసమానతలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. మున్సిపల్ కేంద్రాలలో పేదరికం 28.6 శాతం నుండి 24.6 శాతానికి తగ్గింది. తక్కువ జనాభా కలిగిన ప్రాంతాలు, విస్తరించి ఉన్న గ్రామీణ ప్రాంతాలలో ఇది 42.5 శాతం నుండి 39.5 శాతానికి తగ్గింది.

అయినప్పటికీ, నగరాలతో పోలిస్తే గ్రామీణ ప్రాంతాల్లో పేదరికం ఇంకా 1.6 రెట్లు ఎక్కువగా ఉందని ఈ గణాంకాలు తెలిపాయి. తన పాలనలో లక్షలాది మంది పేదరికం నుంచి విముక్తి అవ్వడం పట్ల ఆ దేశాధ్యక్షుడు గుస్తావో పెట్రో హర్షం వ్యక్తం చేశారు. తాజాగా వెల్లడించిన నేషనల్ డిపార్ట్‌మెంట్ ఆఫ్ స్టాటిస్టిక్స్ ను ఆయన ఉటంకిస్తూ.. ఆగస్టు 2022లో తాను అధ్యక్ష బాధ్యతలు చేపట్టినప్పటి నుండి ప్రతిపాదిత జీవన వేతన విధానాన్ని అమలు చేయడానికి ముందే తన ప్రభుత్వం 40 లక్షల మందిని పేదరికం నుండి బయటపడేసిందని ఆయన చెప్పారు. బహుశా తన పదవీ కాలం (ఆగస్టు 6 2026కి) ముగిసేలోపు ఈ సంఖ్య 50 లక్షలకి చేరుకునే అవకాశం ఉందని పెట్రో ఎక్స్‌ ‌పోస్టులో పేర్కొన్నారు. తన హయాంలో తీవ్ర పేదరికం నుంచి పది లక్షల మందిని విముక్తి చేసినట్లు పెట్రో తెలిపారు. పేదరికం, అసమానతలు తగ్గడం వల్ల అవి కొలంబియాలో శాంతిని సుస్థిరం చేయడానికి దోహదపడతాయని పెట్రో నొక్కి చెప్పారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -