ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్
న్యూయార్క్ : తమ దేశ వైఖరిని ఐరాస సర్వసభ్య సమావేశంలో గట్టిగా సమర్ధిం చుకుంటామని ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెెజెష్కియాన్ చెప్పారు. న్యూయార్క్ బయలుదేరి వెళ్లడానికి ముందు ఆయన మంగళవారం విలేకరులతో మాట్లాడుతూ ‘మేము గర్వంగా తలెత్తుకొని బయటపడ్డాం. ఇది మా అందరి గౌరవానికి, గర్వానికి చిహ్నం. కాబట్టి అంతర్జాతీయ వేదికలపైమా వైఖరిని దృఢంగా సమర్ధించుకుంటాం’ అని తెలిపారు. ఇరాన్ దుస్థితిని అంతర్జాతీయ సమాజానికి తెలియజేయడానికి ఈ అవకాశాన్ని ఉపయోగించుకుంటామని, ఎన్ని అన్యాయాలు, అక్రమాలు జరిగినా ఇరాన్ ప్రజలు తమ పట్టును వీడకుండా నిలబడ్డారని శత్రువులకు గట్టిగా చెబుతామని అన్నారు. కాగా ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్చీ ఇప్పటికే న్యూయార్క్ చేరుకున్నారు. అమెరికాతో యుద్ధం మొదలైన తర్వాత పెజెష్కియాన్, అరాగ్చీ ఆ దేశంలో అడుగు పెట్టడం ఇదే మొదటి సారి. ఇరాన్ నేతల ప్రయాణానికి అవసరమైన వీసా లను అమెరికా ఆమోదించింది. అయితే న్యూ యార్క్ లో వారి కదలికలపై ఆంక్షలు విధిం చింది. పెజెష్కి యాన్ మీడియా బృందం సభ్యులు సహా అనేక మంది ప్రతిని ధులకు వీసాలను నిరాకరించింది. న్యూయార్క్ చేరుకున్న తర్వాత అరాగ్చీ ఐరాస సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెర్రెస్‌తో టెలిఫోన్లో మాట్లాడారు. సర్వసభ్య సమావేశపు అజెండా గురించి, అంతర్జాతీయ శాంతి, భద్రత గురించి వారు చర్చించారు.
ఐరాసలో మా వైఖరిని మరింత గట్టిగా వినిపిస్తాం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



