ఐరాస జనరల్ అసెంబ్లీలో ట్రంప్ బెదిరింపు
న్యూయార్క్ : పశ్చిమాసియాలో యుద్ధం ముగింపుపై అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. ఇరాన్‌పై దాడులను పునఃప్రారంభించాలా వద్దా అనే విషయంపై నిర్ణయం తీసుకోవాల్సి ఉందన్నారు. నవంబర్ 3న జరిగే మధ్యంతర ఎన్నికల తర్వాత ఇరాన్‌తో ఒప్పందం కుదురుతుందని అంచనా వేస్తూనే, ఒకవేళ ఒప్పందాన్ని తిరస్కరిస్తే ఇరాన్‌ను నాశనం చేస్తామని బెదిరించారు. మంగళవారం ఐక్యరాజ్య సమితి సర్వసభ్య సమావేశంలో ట్రంప్ ప్రసంగిస్తూ ఇరాన్‌కు రెండు ప్రత్యామ్నాయాలను సూచించారు. ఒకటి.. దేశాన్ని పునర్నిర్మించుకోవడానికి వీలు కల్పించే ఒప్పందం చేసుకోవడమా లేక అమెరికా సైనిక చర్యను కొనసాగించడమా తేల్చుకోవాలని హెచ్చరించారు. ‘‘నేను ఇస్లామిక్ రిపబ్లిక్‌ను త్వరగా నాశనం చేయాలా? లేక వారి మనుగడకు అవకాశం లేకుండా భవిష్యత్తు వైభవం లేదా తరాలపై ఆశ లేకుండా నరకానికి పంపాలా?’’ అని ట్రంప్ అన్నారు. అమెరికా సైనిక చర్యను ట్రంప్ సమర్థించడంతో ఇరాన్ ప్రతినిధులు వాకౌట్ చేశారు. దీంతో హాలులో కేవలం ఒక ప్రతినిధి మాత్రమే మిగిలినట్టు సమాచారం. అదే విధంగా ‘‘వారు ఒకప్పుడు మధ్యప్రాచ్యంలో పెత్తనం చెలాయించేవారు, కానీ ఇప్పుడు అలా లేరు’’ అని ఇరాన్‌ను ప్రపంచంలోనే ఉగ్రవాదా నికి ప్రధాన స్పాన్సర్‌గా ట్రంప్ అభివర్ణించారు. టెహ్రాన్‌తో ఒప్పందం కోసం వాషింగ్టన్ పదేపదే ప్రయత్నించిందని, కానీ ఇరాన్ ఆ ప్రయత్నాలను తిరస్కరించిందని చెప్పారు. టెహ్రాన్ తన క్షిపణి , డ్రోన్ సామర్థ్యాలను విస్తరిస్తోందని, అవి ఐరో పాకు ముప్పు కలిగించగలవని కూడా ట్రంప్ ఆరోపించారు.
ఒత్తిడిని కొనసాగించాలని ట్రంప్ పిలుపు
టెహ్రాన్‌పై ఒత్తిడిని కొనసాగించాలని ట్రంప్ ఆయా దేశాలను కోరారు . వాణిజ్య నౌకలపై ఇరాన్ దాడులను ఖండించినందుకు ఐక్యరాజ్యసమితి భద్రతా మండలికి ధన్యవాదాలు తెలిపారు. ‘‘ఇప్పుడు మనం ఒత్తిడిని కొనసాగించడంలో అంతే ఐక్యంగా ఉండాలి’’ అని ఆయన అన్నారు. హార్ముజ్ జలసంధి గుండా యూఎస్ నౌకాదళం 1 బిలియన్ బ్యారెళ్లకు పైగా చమురును రవాణా చేసిందని అన్నారు.
ఒప్పందాన్ని తిరస్కరిస్తే .. ఇరాన్‌ను నాశనం చేస్తాం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



