Wednesday, September 23, 2026
E-PAPER
Homeఅంతర్జాతీయంరష్యాలో పుతిన్‌ అనుకూల పార్టీ జయకేతనం

రష్యాలో పుతిన్‌ అనుకూల పార్టీ జయకేతనం

- Advertisement -

మాస్కో : రష్యా పార్లమెంటరీ ఎన్నికలలో అధ్యక్షుడు పుతిన్‌ అనుకూల యునైటెడ్‌ రష్యా పార్టీ (యూఆర్‌పీ) విజయం సాధించింది. ఉక్రెయిన్‌పై తాను చేస్తున్న యుద్ధానికి ప్రజల మద్దతు ఉన్నదా లేదా అనే విషయం పైనే ఈ ఎన్నికలు జరుగుతున్నాయని పుతిన్‌ గతంలో చెప్పిన విషయం తెలిసిందే. మొత్తం పోలైన ఓట్లలో 95 శాతానికి పైగా ఓట్లను లెక్కించగా యూఆర్‌పీ 57.83 శాతం ఓట్లు పొందిందని ఎన్నికల కమిషన్‌ సోమవారం తెలిపింది. 2021లో దిగువసభ డ్యూమాకు జరిగిన ఎన్నికలలో అధికార యూఆర్‌పీకి 49.8 శాతం ఓట్లు లభించాయి. ప్రాథమిక ఫలితాల ప్రకారం 450 స్థానాలు ఉన్న డ్యూమాలో యూఆర్‌పీకి 355 సీట్లు లభించే అవకాశం ఉంది. ప్రస్తుతం ఆ పార్టీకి ఉన్న స్థానాల కంటే ఈసారి 20 సీట్లు అదనంగానే వస్తాయి. ఆక్రమిత ఉక్రెయిన్‌లోని నాలుగు ప్రాంతాలలో కూడా పోలింగ్‌ జరిగింది. కాగా పుతిన్‌ భాగస్వామి రంజాన్‌ కదిరోవ్‌ వరుసగా ఐదోసారి చెచెన్యా నేతగా ఎన్నికయ్యారు. ఆయనకు 99.85 శాతం ఓట్లు లభించాయి. రాజకీయ ప్రత్యర్థుల అణచివేత, ఇంటర్నెట్‌ సౌకర్యం నిలిపివేత వంటి ఆరోపణల మధ్య డ్యుమాకు ఎన్నికలు జరిగాయి.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -